'బాహుబలి-ది బిగినింగ్' సాధించిన రేంజ్‌లో కలెక్షన్లు సాధించకపోయినా నాన్ బాహుబలి రికార్డులను మెగాస్టార్ చిరంజీవి దశాబ్దం తర్వాత ఎంట్రీ ఇచ్చిన 'ఖైదీ నెంబర్ 150' సాధించింది. ఇక డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు'లు అంత నెగటివ్ టాక్‌లోనూ 50కోట్ల క్లబ్‌ను దాటాయి. మరి వీరిద్దరి కలిసి నటిస్తే అనే కలను తాను సాకారం చేస్తానని ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి ఎప్పుడో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కాగా చాలా మంది ఇది జరిగే పని కాదని తేల్చేశారు. కానీ సుబ్బిరామిరెడ్డి ఆనాడు చిరంజీవితో మాట్లాడాడు. త్రివిక్రమ్‌తో కూడా ఈ మల్టీస్టారర్ చిత్రం కోసం కథా చర్చలు జరిపానని తెలిపాడు. కానీ చాలా మంది దీనిని ఓ పబ్లిసిటీ జిమ్మిక్కుగానే భావించారు.తాజాగా త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్‌లతో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్న షూటింగ్‌లో సుబ్బిరామిరెడ్డి ప్రత్యక్షమయ్యాడు. త్వరలో మెగాబ్రదర్స్‌తో మల్టీస్టారర్ ఖాయమని తేల్చేశాడు.
కాగా 'బాహుబలి' రేంజ్‌లో ఎవరి భాగస్వామ్యం లేకుండా అంతటి భారీ బడ్జెట్ చిత్రం తీయగల మొనగాడు కేవలం టి.సుబ్బిరామిరెడ్డి మాత్రమే అని మాత్రం ఒప్పుకోవాలి. ఆయన మెగాస్టార్‌తో నిర్మించిన 'స్టేట్‌రౌడీ', వెంకటేష్‌తో తీసిన 'త్రిమూర్తులు, సూర్య ఐపిఎస్'లతో పాటు భగవద్గీత, వివేకానంద వంటి చిత్రాలు ఆయన సినిమాలకు పదిపైసలు ఖర్చు పెట్టడమే గానీ ఏదీ ఆశించి, మరీ ముఖ్యంగా పెట్టిన డబ్బు తిరిగి వస్తుందా? లేదా? అని ఆలోచించే రకం కాదు ఆయన.
కోట్లను మంచినీళ్లలా ఖర్చుపెడతాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి-పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్ కాబట్టి క్యాస్టింగ్, హీరోయిన్లు, టెక్నీషియన్స్, బడ్జెట్, గ్రాఫిక్స్ అన్నీ ఆయన ఓ రేంజ్‌లో చేస్తాడు. మరి ఇది యూనివర్శల్ సబ్జెక్ట్ అయితే మాత్రం 'బాహుబలి'ని మించిన రేంజ్‌లో ఖర్చుపెట్టి, సినిమా నిర్మిస్తాడని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.