వెండితెర మీద వెలుగొందుతున్న హీరోలు బుల్లితెర మీద కూడా తమ టాలెంట్ ని చూపించడానికి రెడీ అయిపోతున్నారు. ఇలాంటి తరహా టాలెంట్స్ ని బాలీవుడ్ హీరోస్ ఎప్పటి నుండో మొదలు పెట్టేశారు. అక్కడ సినిమాలు ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాయో అదే రేంజ్ లో హీరోలు హోస్ట్ చేసే బుల్లితెర షోస్ కూడా సూపర్ సక్సెస్ అవుతాయి. అమితా బచ్చన్ 'కౌన్ బనేగా కరోడ్పతి' తో అదరగొట్టగా...సల్మాన్ ఖాన్ 'బిగ్ బాస్' రియాల్టీ షోస్ తో అదరగొట్టాడు. ఇక ఇక్కడ టాలీవుడ్ లో కూడా నాగార్జున 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అంటూ మా ఛానెల్ లో గేమ్ షో కి హోస్ట్ గా అదరగొట్టేశాడు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' మూడో సీజన్స్ ని సూపర్ గా సక్సెస్ చేసిన నాగ్ నాలుగో సీజన్ కి తప్పుకోగా.... నాగార్జున వారసత్వాన్ని చిరంజీవి తీసుకుని 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సీజన్ 4ని సక్సెస్ ఫుల్ గా 60 ఎపిసోడ్స్ నడిపి గ్రాండ్ గా ఈ మధ్యనే ఎండ్ చేశాడు.
అయితే ఇప్పుడు వీరి బాటలోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరబోతున్నాడట. ఎన్టీఆర్ వెండి తెరమీద వరుస హిట్స్ తో దూసుకుపోతూ చేతినిండా సినిమాలతో బిజీగా వున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా యంగ్‌టైగర్ ఎన్టీయార్ కూడా బుల్లితెరపై తన సత్తా చాటడానికి సిద్ధమైపోతున్నాడు. హిందీలో సూపర్ హిట్ రియాల్టీ షోగా నిలిచిన ‘బిగ్‌బాస్’ను పోలిన ఓ ప్రోగ్రామ్‌ను ‘స్టార్ మా’ ఛానెల్ రూపొందిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు యంగ్ టైగర్ ఎన్టీయార్. ఇప్పటికే ఈ విషయమై మా ఛానెల్ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నడట ఎన్టీఆర్. ఈ విషయాన్ని సదరు ఛానెల్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.
ఎన్టీఆర్ ని సంవత్సరానికి ఒక్కసారి సినిమాల్లోచూసి ఖుషి అవుతున్న ఫాన్స్ ఇప్పుడు బుల్లి తెరమీద రోజు సందడి చేస్తూ కనబడుతుంటే ఇక వారి ఆనందానికి అవధులు ఉండవంటే నమ్మండి.