Advertisement
Google Ads BL

టీజర్ కి సినిమాకి సంబంధం ఉండదట..!


సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కానుకగా మహేష్ బాబు తాజా చిత్రం 'స్పైడర్' టీజర్ ని ఈ నెల 31 న  విడుదల చేస్తున్నట్లు మహేష్ బాబే స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించాడు.  మహేష్ 'స్పైడర్' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. దీనికి మురుగదాస్ డైరెక్టర్ కావడం, భారీ తారాగణం ఈ మూవీ లో నటించడం, టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ కి జోడిగా నటించడం వంటి విశేషాలు చాలానే వున్నాయి. స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న 'స్పైడర్' చిత్రంలో మహేష్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.

Advertisement
CJ Advs

అయితే మహేష్ 'స్పైడర్' టీజర్ కోసం మురుగదాస్ చాలానే కష్టపడ్డాడట. ఈ టీజర్ ని భారీ వ్యయంతో ప్రత్యేకంగా షూట్ చేశారట. అందుకే ఈ టీజర్ చాలా స్పెషల్ గా వుండబోతుందట. మరి టీజర్ నే ఇలా పక్కాగా చెక్కిన మురుగదాస్ సినిమాని ఏ రేంజ్ లో చెక్కడో అనే ఇంట్రెస్ట్ మాత్రం వచ్చేస్తుందని అంటున్నారు చాలా మంది. అయితే ఇప్పుడు విడుదల చేస్తున్న 'స్పైడర్' చిత్ర టీజర్ కి సినిమాకి ఎటువంటి సంబంధం ఉండదనే టాక్ బయటికి వచ్చింది. 'స్పైడర్' టీజర్ లో కనిపించే సీన్సేమి... సినిమాలో ఉండవని అంటున్నారు. అసలు చాలా సినిమాలు ఆయా సినిమా టీజర్ చూడగానే స్టోరీ ఏంటనేది గెస్ చేసేయ్యొచ్చు. కానీ 'స్పైడర్' టీజర్ చూస్తే సినిమా కథ ఏంటనేది ఏమాత్రం గెస్ చేయలేరట. అసలు మహేష్ ఎలాంటి కేరెక్టర్ లో కనిపిస్తాడో అనే విషయం కూడా రివీల్ కాదట.

కేవలం మహేష్ ని ప్రేక్షకుల ముందు కొత్తగా చూపెట్టడానికే ఈ టీజర్ రిలీజ్ చేస్తున్నారట. అంటే 'స్పైడర్' లో మహేష్ ఎలా వుండబోతున్నాడో మనకి తెలియనివ్వరన్నమాట. కేవలం ఫ్యాన్స్ ని బాధపెట్ట లేక మురుగదాస్ ఇలా మహేష్ ని సపరేట్ గా చూపించేసి మమ అనిపించేస్తున్నాడన్నమాట.

Spyder Movie Teaser..!:

Mahesh Babu's latest movie 'Spyder' Teaser will be released on May 31, according to Mahesh Babu tell in twitter. The talk came out when the film 'Spyder' had no connection with the film's teaser.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs