తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ తమిళంలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా చేసిన చిత్రం 'జెంటిల్‌మేన్'. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా ఓ ఊపు ఊపింది. తాజాగా దాదాపు 25ఏళ్ల కిందట వచ్చిన 'జెంటిల్‌మేన్'కు అల్లు అర్జున్-హరీష్ శంకర్-దిల్‌రాజ్‌ల కాంబినేషన్‌లో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ పూజా హెడ్గే హీరోయిన్‌గా నటిస్తున్న 'డిజె' చిత్రం మూల కథకు చాలా సారూపత్యలే ఉన్నాయంటున్నారు.
'జెంటిల్‌మేన్'లో కూడా హీరో బ్రాహ్మణునిగా, అప్పడాలు చేసే యువకునిగా బ్రాహ్మణ అగ్రహారంలో నివసిస్తూ రాత్రి పూట రాబిన్‌హుడ్‌లా ఉన్నవాడి దగ్గర దోచుకుని, లేనివాడికి పెట్టే పాత్రలో కనిపిస్తాడు. 'డిజె' చిత్రంలోని బ్రాహ్మణ అగ్రహారం, బ్రాహ్మణ గెటప్‌లో బన్నీ, ఆయన బాడీ లాంగ్వేజ్, క్యాటరింగ్ హోటల్, స్లైషర్ గెటప్‌లో సూట్ బూటులో చేతిలో బ్రిట్ కేష్ పట్టుకుని కనిపిస్తుండటంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది.
ఎప్పుడో 25ఏళ్ల కిందట వచ్చిన సినిమా కదా.! ఎవరు గుర్తుపెట్టుకుంటారు? అసలు ఆనాటి కాలం వారు నేడు సినిమాలు చూస్తున్నారా? చస్తున్నారా? అనుకుంటే ప్రమాదమే.. ఈ చిత్రం ఇప్పటికీ సీడీలల్లో, ఇతర భాషల్లో రీమేక్‌గా సుప్రసిద్దం. ఇక బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉన్న మాలీవుడ్‌లో కూడా ఈ చిత్రం తమిళ డబ్బింగ్ వెర్షన్ పెద్ద హిట్టయింది. ఏ విషయం తెలియాలంటే జూన్23 వరకు వేచిచూడక తప్పదు.