Advertisement
Google Ads BL

పవన్‌పై వెటకారమా.. గౌరవమా...?


పవన్‌ వంటి స్టార్‌ హీరో సరసన నటించాలని ఏ హీరోయిన్‌ అయినా కోరుకుంటుంది. అవకాశం వస్తే ఎగిరి గంతేస్తుంది. ఇక ఒకే ఒక్క ఫ్లాప్‌ చిత్రం 'అలియాస్‌ జానకి'లో నటించిన అమ్మాయి అనీషా ఆంబ్రోస్‌, ఆమెను పవన్‌ తన 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌'కు ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఆమెను చేరేలోపే ఆమెను చిత్రం నుంచి తీసేశారని కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అడపాదడపా అవకాశాలు వచ్చినా ఇప్పటికీ బ్రేక్‌రాలేదు. 

Advertisement
CJ Advs

కాగా ఆమె తాజాగా 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' గురించి చెబుతూ, పవన్‌ గారు నటించిన 'గోపాలా...గోపాలా' చిత్రంలో చిన్న పాత్ర చేశాను. పవన్‌ గారు నన్ను చూసి 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' ఆడిషన్‌కు రమ్మన్నారు. ఒక్కసారిగా షాకయ్యాను. వెళ్లాను, ఆడిషన్స్‌ తర్వాత నన్ను ఓకే చేశారు. నేను అప్పుడే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాను. అంతలో అంత పెద్ద స్టార్‌ పక్కన చాన్స్‌ అనే సరికి పరిస్థితులను ఎలా హ్యాండిల్‌ చేయాలి? ఎలా ప్రెజర్‌ను తట్టుకోవాలి అనేవి కూడా తెలియక చాలా ఇబ్బందులు పడ్డాను. 

జనాలు నా గురించి నానా కామెంట్లు చేయడం విన్నాను. నా ట్విట్టర్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేస్తే నిమిషానికి 200 నుంచి 300 మెసేజ్‌లు వచ్చేవి. ఇదంతా చూసి నాకు చాలా భయమేసింది. చాలా పెద్ద భారాన్ని మోస్తున్నాను అనిపించింది. నన్ను ఇంకే సినిమాకి కమిట్‌ అవ్వవద్దు అంటే 8నెలలు ఖాళీగానే ఉన్నాను. ఆ సమయంలో నాపై ఉన్న ప్రెజర్‌ అలాంటిదిలాంటిది కాదు. దాన్ని తట్టుకోవడం చాలా కష్టమైపోయింది. 

ఆ సమయంలో నా స్థానంలో కాజల్‌ను తీసుకున్నట్లు చెప్పారు. (కాస్త నవ్వుతూ) ఆ పాత్ర ఆమె చేయడమే కరెక్ట్‌. ఆ విషయంలో నాకు ఎలాంటి బాధ అనిపించలేదు.. అంటూ కొంటెంగా సమాధానం చెప్పింది అనీషా ఆంబ్రోస్‌. 

Anisha Ambrose About Pwan Kalyan..!:

Any heroine wants to star opposite like Power star Pawan. Anisha Ambrose, news that Pawan was chosen for her 'Sardar Gabbar Singh'. While she's new to 'Sardar Gabbar Singh', I played a small role in the film 'Gopala ... Gopala' starring Pawan.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs