Advertisement
Google Ads BL

తీవ్ర డిప్రెషన్‌లో శ్రీనువైట్ల..!


ఒక రెండు మూడేళ్ల ముందు వరకు శ్రీనువైట్ల ఆడింది ఆటా..పాడింది పాట.. కానీ నేడు సీన్‌ మారిపోయింది. 'నీకోసం, ఆనందం...'ఇలా మొదలైన ఆయన కెరీర్‌ 'ఢీ'తో పీక్‌కి వెళ్లిపోయింది. 'వెంకీ, దుబాయ్‌శ్రీను' వంటి చిత్రాలతో పాటు ఆయన మెగాస్టార్‌తో 'అందరివాడు' చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని కూడా తొందరగానే సాధించాడు. ఇక 'రెడీ, కింగ్‌, దూకుడు, బాద్‌షా' ఇలా సాగిన ఆయనకెరీర్‌ 'ఆగడు'తో ఫల్టీ కొట్టింది. 

Advertisement
CJ Advs

ఆ తర్వాత మెగాకాంపౌండ్‌ దయతో 'బ్రూస్‌లీ' చేశాడు. రామ్‌ చరణ్‌ హీరోగా నటించగా, చిరంజీవి అతిధి పాత్రలో మెరిశాడు. కానీ ఫలితం లేదు. తర్వాత బన్నీకి 'మిస్టర్‌' కథ చెప్పగా ఆయన మరో మెగాహీరో వరుణ్‌ తేజ్‌కు ఆ కథను సూచించాడు. ఈ చిత్రం డిజాస్టర్‌ కావడంతో పాటు శ్రీనువైట్ల తన అస్తులను కూడా అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. సినీ ఫీల్డ్‌లో ఆయనకు మిత్రుల కంటే శత్రువులే ఎక్కువగా ఉన్నారు. ప్రతి టెక్నీషియన్‌తోనూ. దర్శక నిర్మాతలతో, హీరోలతో వైరం ఉంది. దీంతో ఎవ్వరూ ఆయనను కాపాడే ప్రయత్నం చేయడం లేదు. 

దాంతో ఆయన ఇంట్లోనే ఉండి తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నాడట. ఆయన సన్నిహితులే ఆయనకు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారని సమాచారం. మరోవైపు ఆయన ఇప్పటికైనా మరలా తన మెదడుకు, కలానికి పదును పెట్టి మీడియం రేంజ్‌ హీరోతోనో లేక చిన్న హీరోతోనైనా దమ్మున్న కథ తీస్తే ఆయనకు అవి హిట్లు ఇస్తాయని, ఆయనకు ఆ టాలెంట్‌ ఉందని, కానీ రామ్‌, నితిన్‌ వంటి మీడియం హీరోలు కూడా ఆయన్ను రిజెక్ట్‌ చేస్తుండటంతో ఆయన తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నాడని సమాచారం. 

Sreenu Vithala in Severe Depression ..!:

A couple of three years ago Sreenu Vaitla played the song .. but the song turned out today. 'Mister' tells the story and he tells another story to Varun Tej. The movie was a disaster and Srinu Vaitla had to sell its properties. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs