Advertisement
Google Ads BL

మెగా ఫ్యాన్స్ ఇక రెడీ అయిపోండి..!


చిరంజీవి ఇపుడు తన సమయాన్ని మొత్తం ఉయ్యాలవాడ ప్రాజెక్ట్ మీదే పెట్టాడు. అందుకే బుల్లితెర మీద మీలో ఎవరు కోటీశ్వరుడి గేమ్ షో కి కూడా బ్రేక్ ఇచ్చేశాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. ఇప్పటికే ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరు స్కెచ్ లు కూడా రెడీ అవుతున్నాయి. అలాగే చిరంజీవి కొత్త గెటప్ తో మొదటి దశ ఫొటో షూట్ కూడా కంప్లీట్ చేశారని సమాచారం. 

Advertisement
CJ Advs

ఇక ఉయ్యాలవాడని చిరంజీవి పుట్టిన రోజు కానుకగా ఆగస్ట్ 22న లాంచ్ చేసేందుకు నిర్మాత రామ్ చరణ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి లు శతవిధాలా కృషి చేస్తున్నారు. అయితే సినిమా లాంచింగ్ రోజునే ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి ఫస్ట్ లుక్ ని కూడా లంచ్ చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇక ఓపెనింగ్ రోజునే ఉయ్యాలవాడ ఫస్ట్ లుక్ తో సందడి చేయడానికి రెడీ అవుతున్నారని వినికిడి. మరి ఆగష్టు లో మెగా ఫ్యాన్స్ కి మూడు పండగలు ఒకే సారి వస్తున్నాయన్నమాట. ఒకటి తమ అన్నయ్య చిరు పుట్టిన రోజు, మరొకటి చిరు కొత్త చిత్రం ఉయ్యాలవాడ లాంచ్, మరొకటి చిరు ఉయ్యాలవాడ ఫస్ట్ లుక్. సో.. కాసుకోండి మెగా ఫ్యాన్స్ పండగ చేసుకోవడానికి రెడీ అయిపోండి.

Uyyalawada Narasimha Reddy Biopic Launch on August 22nd 2017!:

Chiranjeevi has now put his time on the whole Uyyalawada project. Producer Ram Charan and director Surender Reddy are doing their best to Uyyalawada Narasimha Reddy Film launch on August 22 as Chiranjeevi's birthday gift. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs