Advertisement
Google Ads BL

ఈ చిత్రమైనా ఆయనకు కోపం తగ్గిస్తుందా..?


జనాలు, రాజకీయనాయకులు...ఇలా ఎవరైనా తమకు ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే 'ఎవడి గోల వాడిది' అంటారు. ఇక ఇదే టైటిల్‌తో లగడపాటి శ్రీధర్‌ స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో చిత్రం తీశాడు. దాంతో ఇది పరిశ్రమలో బాగా నానుడిలో ఉండిపోయింది. ఇక విషయానికి వస్తే యాంగ్రీ యంగ్‌మేన్‌..సారీ యాంగ్రీ ఓల్డ్‌మేన్‌ రాజశేఖర్‌కు గత కొంతకాలంగా హిట్స్‌లేవు. ఆయనతో పాటు సినిమా పరిశ్రమకు వచ్చిన సుమన్‌, భానుచందర్‌, వినోద్‌కుమార్‌, జగపతిబాబు, సాయికుమార్‌ వంటి వారందరూ క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా, సపోర్టింగ్‌రోల్స్‌తో తృప్తిపడుతున్నారు. 

Advertisement
CJ Advs

కానీ ఈ యాంగ్రీమేన్‌ మాత్రం నిజ జీవితంలోనే కాదు.. సినిమాలలో కూడా తాను ఇంకా లేత కృష్ణుడినే అనుకుంటున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన 'గోరింటాకు, ఎవడైతే నాకేంటి' తర్వాత ఆయనకు హిట్‌ కాదు కదా...! వర్మ డైరెక్షన్‌లో ఆయన చేసిన 'పట్టపగలు' చిత్రం ఆయనకు పట్టపగలే చుక్కలు చూపించింది. ఇక ప్రస్తుతం ఆయన 'గుంటూరు టాకీస్‌' ఫేమ్‌ ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో 'పిఎస్‌వి గరుడ 125.8' చేస్తున్నాడు. 

మరి నిర్మాతల భరోసా ఏమిటో కానీ ఈ చిత్రాన్ని దాదాపు 25కోట్ల బడ్జెట్‌తో భారీ లెవల్లో నిర్మిస్తున్నారు. హాలీవుడ్‌ స్టంట్‌మాస్టర్స్‌ చేత జార్జియాలో భారీ ఎత్తున యాక్షన్‌ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు. భారీ మొత్తం ఇచ్చి సన్నిలియోన్‌ చేత సాంగ్‌ చేయిస్తున్నారు. ఇందులో పూజాకుమార్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈమె గతంలో కమల్‌ సరసన 'విశ్వరూపం, ఉత్తమ విలన్‌' చిత్రాలలో నటించింది. మరి ఈ సినిమా బిజినెస్‌ ఎప్పుడయి, చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి...!

Rajasekhar New Film 'PSV Garuda 125.8'..!:

People, politicians ... If anyone wants to like it, it is called 'yavadi gola vadidi'. Angry Youngman .. sorry Angry Oldman Rajasekhar there is some times no hit movies. Now he is doing the 'PSV Garuda 125.8' and 'Guntur Talkies' directed by fame Praveen Sattar.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs