Advertisement
Google Ads BL

దీనికేం సమాధానం చెబుతారు..?


కాస్త సినిమా సన్నివేశాలలో శృతి మించి చేసినా కూడా నటి అపూర్వ ఇప్పుడు ఓ మంచి పని చేసింది. చలపతి రావు పై వచ్చిన కామెంట్లపై ఆమె స్పందిస్తూ చలపతి రావు బాబాయ్‌.. మాట్లాడింది తప్పే కావచ్చు. కానీ ఆయన ఇన్‌టెన్షన్‌ను ఎవ్వరూ అర్ధం చేసుకోలేదు. ఆడవారికి ఆయన ఎంతో గౌరవం ఇస్తారు. ఒకసారి నా కాలు ఆయనకి తగిలితే కంగారు పడ్డాను. ఫర్లేదమ్మా.. నువ్వు నా కూతురు వంటి దానివి అన్నాడు. 

Advertisement
CJ Advs

ఆయన గురించి అందరూ చెడుగా మాట్లాడుతుంటే, రాస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. చలపతి రావు బాబాయ్‌తో పాటు అలీ కూడా 'ఏం మేసొచ్చావా' అంటారు. అంటే ఏం తిని వచ్చావు అని అర్ధం. దాన్ని మనం రిసీవ్‌ చేసుకునేదానిని బట్టి ఉంటుంది. చలపతి రావు బాబాయ్‌ గురించి తెలియని వారే ఆయన గురించి మంచిగా చెబుతుంటే, ఆయన మంచితనం, మనస్తత్వం తెలిసిన వారెవ్వరూ ఆయనకు అనుకూలంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడం దారుణం. తాతయ్యల వయసుల్లో కూడా ఒంటిపై చెయ్యేసి మాట్లాడుతూ, షూటింగ్‌గ్యాప్‌లో పడకగదిలోకి రమ్మనే వారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. 

కానీ చలపతి రావు బాబాయ్‌ అలా కాదు.. అని ఆవేదన వెలిబుచ్చింది. ఇక చలపతి రావు డైలాగ్‌కే మండిపడిన వారు తాజాగా రాంగోపాల్‌ వర్మ మాఫియా గురించి తనకు తెలిసిన విషయాలను సినిమాలలో చూపించలేకపోయానని అంటూ 'గన్స్‌ అండ్‌ ధైస్‌' వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశాడు. చిన్నపిల్లల ముందే హింసాత్మక సంఘటనలు, రక్తం చిందడం, మాఫియా పేరుతో పచ్చిగా నగ్నంగా కనిపించే అశ్లీల సీన్స్‌తో యూట్యూబ్‌ను షేక్‌ చేయడానికి వస్తున్నాడు. 

సినిమాలకైతే సెన్సార్‌ ఉంటుందని, ఇలా సోషల్‌ మీడియా మీద వర్మ చేసిన దాడిగా దీనిని చూడవచ్చు. చూస్తూ ఉండండి... చలపతి రావును తిట్టిన వారే రేపు ఆ వెబ్‌సిరీస్‌ను ఎగబడి చూస్తారు. టాప్‌ పొజిషన్‌కు చేరుస్తారు. ఇది నిజం...! ఇప్పుడు మాట్లాడుతున్న వారందరివీ రెండు నాల్కల ధోరణులు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

Apoorva Responded on Chalapathi Rao Issue!:

Actress Ananda now has done a good job even if she is beyond the scene in a few scenes. Apoorva responded to the comments on Chalapathi Rao. But he does not understand the intention.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs