Advertisement
Google Ads BL

మల్టి స్టారర్ అంతా కారు చుట్టూనే..!


‘భలే మంచి రోజు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తూ నలుగురు యాంగ్ స్టార్స్ కలిసి 'శమంతకమణి' అనే మల్టి స్టారర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆదిలు కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టార్ చిత్రంపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. చిన్న హీరోలు, పెద్ద హీరోలు ఎవరు ఇద్దరు కలిసి నటించిన ఆ చిత్రంపై టాలీవుడ్ లో మంచి అంచనాలు ఉంటాయి. నలుగురు యువకథానాయకులు కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి పెట్టిన టైటిల్ 'శమంతకమణి' కూడా అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు ఈ చిత్రం మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Advertisement
CJ Advs

హీరోల వాయిస్ ఓవర్ తో ఈ మోషన్ పోస్టర్ ని డిజైన్ చేసిన దర్శకుడు నలుగురు హీరోల మొహాలను చూపెట్టకుండా మోషన్ పోస్టర్ చివరిలో ఒక పాత కారుని మాత్రం చూపించారు. ఇక మోషన్ పోస్టర్ లో మొదటగా సుధీర్ బాబు.. పాత సినిమాలో ఐటెం సాంగ్ లో హీరోయిన్ పేరులా శమంతక మణి ఏంటండీ అంటూ స్టార్ట్ చెయ్యగానే తర్వాత ఆది వెంటనే కరెక్టుగా చెప్పారు.. నాదీ సేమ్ ఫీలింగ్ అంటాడు. ఆ తర్వాత నారా రోహిత్.. శమంతకమణా.. ఇదేదో పురాణాల్లో కథ లాగుంది అంటే.. లాస్ట్ లో సందీప్ కిషన్ బ్రదర్ అక్కడ పడింది ఆ బొమ్మ కాదు అంటూ ముగిస్తాడు.

దీనిని బట్టి 'శమంతకమణి' చిత్రం కథ అంతా ఆ పాత కారు చుట్టూతానే తిరుగుతుందని అర్ధమైపోతుంది. అలాగే నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది లు చెప్పిన డైలాగ్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసేలా వున్నాయి.

Multi Starrer Movie 'Shamanthakamani'!:

Four Yang stars together with 'Shamanthakamani' are doing a multi starrer film in the making of 'Bhavya Creations' Anand Prasad in 'Balemanchi Roju' directed by Sriram Aditya. Nara Rohit, Sudheer Babu, Sundeep Kishan and Adi are doing a lot of interest in this multistar movie.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs