రామ్ చరణ్, సుకుమార్ డైరెక్షన్ లో ఒక పల్లెటూరి ప్రేమ కథలో దివ్యంగుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సమంతతో రొమాన్స్ చేస్తున్న చరణ్ బెస్తవానిగా నటిస్తున్నాడని లీకైన పిక్స్ ని బట్టి తెలుస్తుంది. ఇక పల్లెటూరి వాతావరణంలో అంటే కొల్లేరు, రాజమండ్రి, పాలకొల్లు పరిసర ప్రాంతాలలో మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ కోసం కొంత విరామం తీసుకుంది. మండుతున్న ఎండలు ఒక కారణం అయితే హీరోయిన్ సమంతకు వడ దెబ్బ తగలడం వల్ల షూటింగ్ కి కొంత విరామం ఇచ్చిన సుకుమార్ రెండో షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాడు.
అయితే షూటింగ్ మొదలై చాలాకాలం గడుస్తున్నా ఈ చిత్రం టైటిల్ అంటూ ఏది ఫైనల్ కాలేదు. 'రేపల్లె'తో పాటే రెండు మూడు టైటిల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేసినా ఏది ఫైనల్ చెయ్యలేదు. మరి చరణ్ సినిమా కి టైటిల్ ఏమిటో అనే ఇంట్రెస్ట్ రోజురోజుకి మెగా ఫ్యాన్స్ తో పాటే రామ్ చరణ్ లోను ఎక్కువైపోతోంది. అందుకే రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు ఒక సందేశం పంపాడు. అదేమిటంటే సుకుమార్ నాతో చేస్తున్న సినిమా కోసం నాలుగైదు మంచి టైటిళ్లు అనుకున్నారని.... కానీ ఇంకా ఫైనల్ టైటిల్ ఏమిటి చెప్పలేదని కాబట్టి సోషల్ మీడియాలో ఆయన్ను టైటిల్ ఏమిటో త్వరగా చెప్పమని ఒత్తిడి చేయమని ఫ్యాన్స్ కు సలహా ఇచ్చాడు.
మరి చరణ్ చెప్పిన సలహా మేరకు మెగా ఫ్యాన్స్ సుకుమార్ పై ఎలాంటి వత్తిడి తీసుకొస్తారో చూడాలి. అలాగే ఫ్యాన్స్ ఒత్తిడికి తలొగ్గి సుకుమార్ వెంటనే ఈ టైటిల్ ని ఫైనల్ చేసేస్తాడా అనేది కూడా కాస్త ఇంట్రెస్ట్ ని కలిగించే విషయమే.