Advertisement
Google Ads BL

నాగ చైతన్య మొదటి రోజే కుమ్మేశాడు..!


నాగ చైతన్య - రకుల్ ప్రీత్ జంటగా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన 'రారండోయ్ వేడుక చూద్దాం'  చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి ఆటతోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది. నాగ చైతన్య గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రానికి బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. అసలు నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ లభించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలిరోజు రూ 3.40 కోట్ల షేర్ ని సాధించింది. ఈ కలెక్షన్స్ చూస్తుంటే 'రా రండోయ్ వేడుక చూద్దాం' మూవీకి ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉందో అర్ధమవుతుంది. 

Advertisement
CJ Advs

నాగ చైతన్య నటన, భ్రమరాంభగా రకుల్ ప్రీత్ సింగ్ అందం, నటన, అభినయం వంటి విషయాలతో రారండోయ్ చిత్రానికి మంచి హైప్ క్రియేట్ అయ్యింది. మంచి కుటుంబ కథా చిత్రంగా రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం నాగ చైతన్య కెరీర్ లో నిలిపోతుందని  సినిమాకి వచ్చిన టాక్ ని బట్టి అర్ధమవుతుంది. ఈ చిత్ర నిర్మాతగా చాలా ఏరియాల్లో ఈ చిత్రాన్ని సొంతగానే రిలీజ్ చేసుకున్న నాగార్జున కి ఈ వసూళ్లతో లాభాల పంట పండుతుందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నారు. ఇక వేసవిసెలవు కావడంతో ఈ చిత్రం ఈ వీకెండ్ లో మరిన్ని వసూలు సాధిస్తుందని చెబుతున్నారు.

Passitive Talk on Rarandoi Veduka Chuddam Movie..! :

Naga Chaitanya - Rakul Preet Pair as Kalyan Krishna Direction 'Rarandoi Veduka Chuddam' is Releasing a movie this Friday. The movie has earned Rs 3.40 crore in the two Telugu states in first day.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs