Advertisement
Google Ads BL

పవన్‌ గత జన్మ చెబుతాడంట..!


కొంతకాలం కిందట మూఢనమ్మకాలు, కులపిచ్చి అనేవి అక్షరాస్యత లేకపోవడం, సమాజంలో ఏమి జరుగుతోందో తెలుసుకోలేని అజ్ఞానం, నిరక్షరాస్యత వల్ల కలగుతాయనే మన దేశంలోకి కుహనా మేధావులు పేర్కొనేవారు. మూఢనమ్మకాలు తగ్గడానికి అక్షరాస్యతే పరమౌషధం అని వాదించేవారు. కానీ అక్షరాస్యత ఎక్కువగా ఉన్న అభివృద్ది చెందిన దేశాలలో కూడా ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. 

Advertisement
CJ Advs

జీసస్‌ను చేరుకోవడానికి సరైన సమయంలో ఆత్మాహుతి చేసుకోవడమే మార్గమని ఓ క్రిస్టియన్‌ మత పెద్ద చెప్పిన మాటలు విని, కొన్ని పదుల సంఖ్యలో దైవభక్తి ఉన్న వారు అమెరికాలో ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఇక ఎన్నో దేశాలలో గమనించడండి. చదువుకున్న వారిలో కూడా మతం మూఢంగా మారుతోంది. క్రికెట్‌ ఆటగాళ్లు, టెన్నిస్‌ ప్లేయర్ల నుంచి ఫుట్‌బాల్‌ ప్లేయర్ల వరకు ఫలానా సంఖ్య ఉన్న జెర్సీ వేసుకుంటేనే బాగా ఆడుతామని, ఫలానా కాలుకే మొదట ప్యాడ్‌ కట్టుకుంటే ఆమ్యాచ్‌లో ఈతాము జట్టును గెలిపిస్తామని.. అలా ఎన్నో పిచ్చి వేషాలు వేస్తుంటారు. 

దీనికి అందంగా మూఢనమ్మకం కాదు...సెంటిమెంట్‌ అనే పేరు చేరుస్తున్నారు. మరి దీనికి సమాధానం ఈ మేధావులైన అక్షరాస్యత గురించి మాట్లాడే వారికి తెలయదా? కులం, మతం అనేవి చదువుకున్న మేధావులలోనే ఎక్కువగా ఉన్నాయని ఎన్నో విషయాలలో తేటతెల్లమవుతోంది. జ్యోతిష్యాన్ని నమ్మని రామోజీరావు సైతం ఒకప్పుడు గ్రహఫలాలు వేయకపోయినా, ఇప్పుడు వేస్తుండటమే దీనికి ఉదాహరణ, ఇదంతా టీఆర్పీ రేటింగ్‌లు, వీక్షకుల సంఖ్యను పెంచుకునే మార్గాలు. తాజాగా ఓ ఆస్ట్రో సైకాలజిస్ట్‌ ఎస్వీ నాగరాజ్‌ అనే వ్యక్తి పలువురు ప్రముఖుల గత జన్మ జీవితాలను తన జ్యోతిష్య అనుభవంతో చెప్పేస్తున్నాడు. 

తాజాగా ఆయన పవన్‌ కళ్యాణ్‌ గత జన్మ, ఆయన వివరాలను తెలిపే ఎపిసోడ్‌ వైరల్‌ అయింది. గత జన్మలో పవన్‌ ఓ రాజు అని, ఇంకా పవన్‌ గురించి ఏమోమో చెప్పాడు. పవన్‌ గత జన్మ మరణం ఎలా జరిగిందో కూడా ఆయన అనర్గళంగా చెప్పేస్తున్నాడు. ఇది కేవలం గత జన్మలపై ప్రతి ఒక్కరికీ ఉండే తెలుసుకోవాలనే జిజ్ఞాసను క్యాష్‌ చేసుకోవడమే. రాబోయే ఎపిసోడ్లలో ఇంకా చాలా విషయాలు చెబుతాడట. ప్రతి చిన్న విషయానికి రాచి గగ్గోళు పెట్టే జనవిజ్ఞాన వేదికల నాయకులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారు కూడా ఆ గొప్ప జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్లి తమ గత జన్మ రహస్యాలు తెలుసుకోవడానికి క్యూలో ఉన్నారేమో....! 

Astro Psychologist SV Nagaraj Will Tell Pawan Past Birth Secrets!:

Culinary intellectuals were briefly mentioned in the past few days by superstitions and culprits who lack literacy and ignorance and illiteracy that they do not know what is happening in society. Pawan Kalyan's latest birthday is the episode of the sesational.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs