Advertisement

ఆయన పై ఇంకా కసితీరలేదు..!


ఇటీవల ఒక వేదిక మీద మహిళల గురించి 50ఏళ్ల సినీ చరిత్ర ఉన్న చలపతి రావు అనుకోకుండా ఒక మాట అనేశాడు. ఆ తర్వాత ఆయన తన తప్పును గ్రహించి, ఒకే ఒక్కమాటతో నన్ను చరిత్ర హీనుడిలా మార్చారు.. అని ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ ఉద్యమకారులకు, మహిళాసంఘాలకు ఇంకా ఆయనపై కసితీరలేదు. ఆయనపై పోలీస్‌ కేసులు, నిర్భయ కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. దీని గురించి చలపతిరావు కుమారుడు, నటుడు, క్రియేటివ్‌ డైరెక్టర్‌ రవిబాబు స్పందించాడు. 

Advertisement

మేము చిన్నతనంలో ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. కానీ మా కోసం, మమ్మల్ని బాగా పెంచి పెద్దవారిని చేయడం కోసం మా నాన్న మరలా పెళ్లి కూడా చేసుకోలేదు. దాంతో ఆయనకు మద పిచ్చి ఉందని అనుకుంటున్నాను. ఇంతకంటే మా నాన్నగారి గురించి ఏమీ చెప్పలేను. ఈ వయసులో ఆయన్ను చరిత్ర హీనుడిగా చేయాలనుకుండా ఆయన్ను భౌతికంగా చంపేయండి. అంతేగానీ ఈ వయసులో ఆయన్ను మానసికంగా చంపవద్దు. 

భార్యలు ఉండగానే అబ్బద్దాలతో మరలా మరలా పెళ్ళిళ్లు చేసుకొనే వారు, గుట్టుచప్పుడు కాకుండా, పైకి పెద్ద మనుషులుగా వ్యవహరించేవారు, చిన్నారులపై కూడా లైంగిక దాడులు చేసేవారు, ఇంతకంటే దారుణమైన కామెంట్లు చేసే వారిని ఎవ్వరూ ఏమీ అనరు. ఎందుకంటే వారు పెద్ద వారు... అంటూ రవిబాబు తన ఆవేదన వ్యక్తం చేశాడు. 

 

Creative Director Ravi babu Responded on Chalapathi Rao Issue:

Recently, Chalapathi Rao, who has a 50-year-old film history of women on a stage, unexpectedly called a word. Chalapathi Rao's son, actor and creative director Ravi Babu responded to this.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement