బాహుబలి చిత్రం విజయం ప్రభాస్ కి అంతర్జాతీయ నటుడిగా గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇక బాహబలి సినిమా విడుదలతో పాటే ప్రభాస్ నెక్స్ట్ ఫిలిం 'సాహో' చిత్ర టీజర్ ని కూడా విడుదల చేసింది 'సాహో' చిత్ర యూనిట్. 'సాహో' చిత్రాన్ని 150 కోట్ల భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే నెల మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకోబోతుంది. టీజర్ తోనే భారీ అంచనాలను పెంచేసిన ఈ చిత్రం వచ్చేనెల నుండి ముంబై వీధుల్లో ఓ స్టైలిష్ రైన్ ఫైట్ ని చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ ఫైట్ సాహో చిత్రానికే హైలెట్ అంటుంది చిత్ర యూనిట్. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ముంబై మాఫియా నేపథ్యం గా సాగుతుందని, ప్రభాస్ డాన్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.
అయితే ప్రభాస్ ఇంత భారీ బడ్జెట్ చిత్రానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో అనుకునే వాళ్లకు ప్రభాస్ షాక్ ఇస్తున్నాడు. ప్రభాస్ సాహో చిత్రానికి రెమ్యునరేషన్ ఏం తీసుకోవడంలేదట. యువీ క్రియేషన్స్ వారు ప్రభాస్ ని ఎంతకావాలో అడగగా దానికి ప్రభాస్ సైలెంట్ గా ఉండిపోయాడట. మరి యువీ క్రియేషన్స్ వారు ప్రభాస్ ఫ్రెండ్స్ కావడంతో నోరు తెరిచి ఇంతకావాలని అడగలేదు కదా. కాకపోతే సాహో చిత్రానికి వచ్చే లాభాల్లో వాటా తీసుకోమని వారు చెప్పగానే ప్రభాస్ దానికి ఎస్ అనేశాడట.
మరి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో హాలీవుడ్ లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రభాస్ కున్న క్రేజ్ దృష్ట్యా భారీ కలక్షన్స్ సాధిస్తుందని అందుకే లాభాలో వాటా తీసుకోవడానికి ప్రభాస్ ఒప్పుకున్నాడని ప్రచారం మొదలైంది.