కమల్‌హాసన్.. ఈయన తనకు కోపం ఎక్కువని ఒప్పుకుంటాడు. అంతే కాదు.. ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతాడు. ఎక్కడా తగ్గడు. కాగా ఈయన ప్రస్తుతం విజయ్ ప్లస్ చానెల్‌లో బిగ్‌బాస్ తమిళ వెర్షన్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. జూన్ 25 నుంచి ఈ కార్యక్రమంలో టీవీలో టెలికాస్ట్ అవుతుంది. తాజాగా ఈ ప్రోగ్రాం ప్రోమోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఓ విలేకరి సామాజిక బాధ్యత కలిగిన అమీర్ చేస్తోన్న 'సత్యమేవ జయతే' వంటి కార్యక్రమాలను చేయకుండా ఈ కమర్షియల్ ఎలిమెంట్ ఉన్న ప్రోగ్రామ్‌లు ఎందుకు చేస్తున్నారు? అని ప్రశ్నించాడు.
దీంతో కమల్‌కి మండిపోయింది. సామాజిక బాధ్యతను ఎవ్వరూ పట్టించుకోని రోజుల్లోనే నేను అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాను. అమీర్‌లా ఇప్పుడు ఆయన కోసమని నా దేశభక్తిని, సామాజిక బాధ్యతను నిరూపించుకోవాల్సిన గత్యంతరం నాకు పట్టలేదు. సామాజిక బాధ్యత అంటే నాకు ఎప్పుడో తెలుసు. మీ నుంచి నేను ఇప్పుడు దానిని వినాల్సిన అవసరం లేదు.. అంటూ ఉతికి ఆరేశాడు. కమల్ చెప్పింది నిజమే. ఆయన ఎన్నో ఏళ్ల కిందటే ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు పలు సామాజిక అంశాలకు చెందిన వాటికి ఉచితంగా బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసి ఉన్నాడు.