Advertisement
Google Ads BL

అమ్మో.. రూ. 7.2 కోట్ల ధర ఆఫర్ చేశాడట..!


డైరెక్టర్ బోయపాటి శ్రీను అంటే మాస్ చిత్రాలకు పెట్టింది పేరు. టాలీవుడ్ లో మాస్ చిత్రాల దర్శకుడిగా మొదటి స్థానంలో బోయపాటి ఉంటాడు. రవి తేజతో 'భద్ర' చిత్రం దగ్గర నుండి నిన్నమొన్నటి అల్లు అర్జున్ 'సరైనోడు' చిత్రం వరకు బోయపాటి మాస్ మాసాలనే దండించి హిట్స్ కొట్టాడు. ఇక బాలకృష్ణ కి 'సింహా, లెజండ్' వంటి పవర్ ఫుల్ మాస్ చిత్రాలు అందించి బాలయ్య కెరీర్ కి ఊపునిచ్చాడు. గత ఏడాది అల్లు అర్జున్ తో 'సరైనోడు' వంటి బ్లాక్ బస్టర్ తీసిన బోయపాటి మళ్లీ ఒక స్టార్ హీరోని మాస్ గా చూపెడతాడని భావించారు.

Advertisement
CJ Advs

కానీ బోయపాటి మాత్రం బెల్లంకొండ సురేష్ కి ఇచ్చిన మాట ప్రకారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఒక చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.  అయితే బోయపాటికి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకున్న బయ్యర్స్ నుండి బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రానికి క్రేజీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయట. బెల్లంకొండ- బోయపాటి చిత్రానికి ఒక డిస్ట్రిబ్యూటర్  ఏకంగా రూ.7.2 కోట్ల ధర ఆఫర్ చేశాడట. సీడెడ్లో మామూలుగా స్టార్ల సినిమాలకు 8-9 కోట్ల మధ్య రేటు పలుకుతుంటుంది. మరి ఈ లెక్కన చూస్తే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు భారీ రేటు వచ్చినట్లే. ఇలా ఈ చిత్రానికి ఇంత క్రేజ్ రావడానికి బోయపాటి ఘనతే అనడంలో సందేహం లేదు.

Boyapati and Bellamkonda Srinivas Combo Film!:

Director Boyapati Sreenu is the name given to Mass films. Boyapati is the first to be the director of Mass films in Tollywood. Bellamkonda - Boyapati Combination Film is a distributor of Rs. 7.2 crores.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs