Advertisement
Google Ads BL

ప్రభాస్ కేవలం ఆరు నెలల్లో వచ్చేస్తాడంట..!


'బాహుబలి ద కంక్లూజన్' విజయంతో అమెరికా వెళ్లి సేద తీరుతున్న ప్రభాస్ తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా ఎప్పుడో లైన్లో పెట్టేశాడు. సుజిత్ డైరెక్షన్ లో'సాహో' చిత్రాన్ని యువీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో హాలీవుడ్ స్టాండర్స్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రభాస్ హీరోగా ఎనౌన్స్ చేశారో లేదో అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టడమే కాకుండా ఈ చిత్రానికి సంబందించిన టీజర్ ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. 'సాహో' చిత్రం టీజర్ చూసిన అందరికి ఇదేదో హాలీవుడ్ ఫిలిం రేంజ్ లో ఉండబోతుందని అర్ధమైంది. 'సాహో' టీజర్ కి విపరీతమైన అదరణతోపాటే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Advertisement
CJ Advs

ఇక ప్రభాస్ అమెరికా నుండి హైదరాబాద్ లో ల్యాండ్ కాగానే 'సాహో' చిత్రాన్ని ఆఫీసియల్ గా సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలను ముంబైలో వచ్చే నెలలో  షూట్ చేస్తారని తెలుస్తోంది. ముంబై తర్వాత అబూధాబీలో ఎక్కువ భాగం షూటింగ్ జరుగుతుందని, ఫైట్ సీన్స్ ని యూరప్ లో చిత్రీకరిస్తారని అంటున్నారు. తెలుగు, తమిళ,హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా ముందుగా బాలీవుడ్ హీరోయిన్ ని అనుకున్నప్పటికీ ఇప్పుడు తెలుగుకు పరిచయం ఉన్న హీరోయిన్ నే తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. 

'సాహో' చిత్రం మెయిన్ గా తెలుగును బేస్ చేసుకునే తెరకెక్కుతుంది కాబట్టి తెలుగులో పరిచయం ఉన్న హీరోయిన్ అయితే బావుంటుందని అనుకుని ఇలా ప్లాన్ చేస్తున్నారట. ఇక 'బాహుబలి' కోసం ఐదేళ్లు కష్టపడిన ప్రభాస్ ఈ 'సాహో' చిత్రాన్ని కేవలం ఆరు నెలల్లో పూర్తి చేయనున్నాడని సమాచారం.

Prabhas is Coming Just Six months..!:

Prabhas, who has gone to America with the success of the 'Baahubali the Conclusion', has put his next picture in the line. The movie 'Saaho' in Sujit Direction is being produced by UV Creations with a huge budget with Hollywood stenders. It is reported that this Saaho film was completed in just six months.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs