Advertisement
Google Ads BL

ఈమె చెప్పేది వింటే షాక్ అవుతారు..!


శ్రీనిజ.. వాస్తవానికి ఈమె ఎవరో ఎవ్వరికీ తెలియదు. కానీ ఒకప్పుడు కే.ఎ.పాల్‌ చేసినట్లు ఆమె వింత వ్యాఖ్యలు చేస్తోంది. వీటిని చూసిన వారు షాక్‌ అవ్వడంతో పాటు ఆమె మానసిక పరిస్థితిపై అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈమెది భీమవరం. ఆమెకు సౌమ్య, జయ అనే పేర్లు కూడా ఉన్నాయి. రాజా రవీంద్రను చూసి సినిమా ఫీల్డ్‌కి వచ్చిందట. పూరీ దర్శకత్వంలో ఓ సీరియల్‌లో నటించానంటోంది. అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయితో సినిమాలలోకి వచ్చిందట. 

Advertisement
CJ Advs

దేవుడు ఆమెకు ఎన్నో శక్తులు ఇచ్చాడంటోంది. స్వర్గీయ ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ మరణాలు ఆమెకు ముందే కలలో కనిపించాయట. ఇక జయలలిత చనిపోయిన తర్వాత ఆమె దగ్గరకు వచ్చి తన బాధ చెప్పుకొని ఏడ్చిందట. దాసరికి అనారోగ్యం నాకు ముందే తెలుసు. ఆయన కోసం దేవుడిని ప్రార్దించాను. కాబట్టే ఆయన బతికున్నాడు. ఇక రామానాయుడు చనిపోయే ముందు దేవుడు నాకు కనిపించి రామానాయుడు ప్రాణం తీయమంటావా? లేక రానాది తీయమంటావా? అని అడిగాడట. లోకంలో ఏమీ అనుభవించని రానాను వద్దని తాను చెప్పడంతోనే రామానాయుడును దేవుడు తీసుకెళ్లిపోతాడట. చంద్రబాబు అలిపిరిలో జరిగిన దాడి సమయంలో, పవన్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌లకు కూడా ప్రాణాపాయం వచ్చినప్పుడు తానే వాటిని తన శక్తితో దూరం చేశానంటోంది. 

తాను ఇక తనువు చాలిద్దామని భావించానని, కానీ దేవుడు నీకు కావాల్సినవి నీకు కల్పిస్తాను.. నీ అవసరం కలియుగానికి ఉంది అని చెప్పడంతో తాను ఇంకా దేవుడి వద్దకు వెళ్లలేదని చెబుతోంది. కాస్త ఎవరైనా కనికరించి,.. ఏదైనా హాస్పిటల్‌లో చేర్పించండి బాబూ..అలా వదిలేయవద్దు....!

Sreenija Stunning Comments on Allu Arjun, Rana, Pawan, YSR, Jayalalithaa and Prabhas:

Sreenija .. In fact no one knows who she is.  They are shocked and she is suspicious of the mood. God has given her many powers. Late NTR and YSR deaths have appeared in her dream before her. Sreenija stunning comments on Allu Arjun, Rana Pawan, ysr, Jayalalitha and Prabhas.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs