అమిత్‌షా తెలంగాణ, ఏపీ పర్యటనలతో ప్రకంపనాలు మొదలయ్యాయి. అమిత్‌షా కేసీఆర్‌ను ఉతికి ఆరేశాడు. కేసీఆర్ కూడా ధీటుగానే సమాధానం చెప్పాడు. కానీ కేసీఆర్ కేంద్రం తమకు ఏమీ సహాయం చేయడం లేదని, అమిత్‌షా చెప్పిన లెక్కలన్నీ తూచ్ అంటున్నాడు. కావాలంటే సవాల్ అంటున్నాడు. బిజెపి నేతలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డిలు కూడా చవక ధరల దుకాణంలో బియ్యం నుంచి ఇతర ప్రతి శాఖకు కేంద్రం చేస్తున్న సాయం లెక్కలతో చూపిస్తామని, కేసీఆర్ రాజీనామా చేస్తాడా? అని ప్రశ్నించడంతో టిఆర్‌ఎస్ బిత్తరపోయింది.
మరోపక్క కేసీఆర్ మోదీతో బాగుండి. అమిత్‌షాపై విరుచుకుపడటాన్ని కాంగ్రెస్ కూడా తప్పు పడుతోంది. తాము వచ్చే ఎన్నికల్లో బిజెపి, టిఆర్‌ఎస్ మినహా తెలుగుదేశంతోనైనా కలవడానికి సిద్దమేనని రేవంత్‌రెడ్డి చెప్పిన ఫార్ములాకు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి చెప్పడం అనూహ్యపరిణామమే. ఆయన మాట్లాడుతూ, టిడిపి ఏమీ అంటరాని పార్టీ కాదని సెలవిచ్చాడు. ఇక ఏపీలో బీజేపీ నాయకులు మిత్రపక్షం అని కూడా చూడకుండా టిడిపి వారు బిజెపిపై నిందలు వేస్తున్నారని, తమ నుంచి విడిపోయే విధంగా వారి మాట తీరు ఉందని, ఇక టిడిపితో పొత్తు చాలంటున్నారు.
చంద్రబాబు మాత్రం అమిత్‌షా విమానంలో ప్రయాణించి, ఆయనకు లంచ్ ఏర్పాటు చేసి మంతనాలు సాగించాడు. కేశినేని నాని మాత్రం నేను బిజెపిపై చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నానంటున్నాడు. ఇక ఈ మధ్య రచయితగా గోళ్లు గిల్లుకుంటూ పోసానిలా ఉన్న చిన్నికృష్ణ బిజెపి తీర్ధం పుచ్చుకున్నాడు. గాంధీ తర్వాత జన్మించిన కారణజన్ముడు మోదీనే అంటున్నాడు. చంద్రబాబు, అమిత్‌షాలు వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తు ఉంటుందంటుటే, మోదీ, వెంకయ్యనాయడు, పురంధేశ్వరి, కావూరి.. ఇక పొత్తు ఉండదంటున్నారు. మొత్తానికి పార్టీలన్నీ కలిసి ప్రజల చెవ్వులో పూలు పెడుతున్నాయి.