Advertisement
Google Ads BL

ఆ వ్యాఖ్యలపై కూడా స్పందించండి..!


చలపతి రావు తాజాగా మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు గర్హనీయమే. ఆయన దానికి సారీ చెబుతూనే కొన్ని ఆలోచనాత్మక ప్రశ్నలను సంధించారు. కానీ వాటినీ మీడియా వారు తలకెక్కించుకోలేదు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ మీడియా అయితే చలపతి రావు ఒక్కసారి అన్న మాటలను పదేపదే చూపించి నేషనల్‌ ఇష్యూగా చిత్రీకరించింది. ఇక చలపతి రావు వయసు మీద పడిన వ్యక్తి కాబట్టి దాన్ని చాదస్తం అనుకోవచ్చు. 

Advertisement
CJ Advs

కానీ యాంకర్‌ రవి వంటి వారి ఎంకరేజ్‌మెంట్‌ను ఏమనాలి? ఇప్పుడు కొందరు చిన్నాచితకా ఆర్టిస్ట్‌లు చలపతి రావు సెట్స్‌లో కూడా ఇంత కంటే అధ్వాన్నంగా ప్రవర్తిస్తాడంటూ రచ్చ చేస్తున్నారు. మరి చలపతి రావు అంత నీచుడైతే తమకు జరిగిన అవమానాన్ని తోటి మహిళలకు జరగకుండా తక్షణ స్పందన వారి నుంచి ఆనాడే ఎందుకులేదు? బాలయ్య 'కడుపు చేయమన్నాడు', అలీ ఆడవారి బొడ్డును బెంజ్‌ సర్కిల్‌తో పోల్చడమే కాదు.. పిక్కలతో పాటు పలు నీచమైన పోలికలు చేశాడు. సమంత అయితే సమ్మగా ఉంటుందన్నాడు. యాంకర్‌ అనసూయ నుంచి సుమ వరకు అందరినీ అవమానించాడు. 

ఇక సినిమా ఫీల్డ్‌లో బూతులు, కంపరమైన మాటలు మాట్లాడే నీచ నటీమణులు ఎందరో ఉన్నారు. పరిశ్రమను ఎరిగిన వారికి అది తెలుసు. మరో పక్క ప్రపంచమంతా, అందులోనూ హాలీవుడ్‌ దాకా ఎదుగుతున్న ప్రియాంకా చోప్రా 'మగాళ్లు పిల్లల్ని కనడానికి తప్ప ఇక దేనికీ పనికిరారంది'. శృతిహాసన్‌ పిల్లలను కనడానికి పెళ్లే చేసుకోవాలా? అని వ్యాఖ్యానించింది. ఇక మహిళా సంఘాల నెపంతో ఇలాంటి రచ్చలు చేసే వారు ఇంట్లో భర్తలకు, పిల్లలకు, అత్త మామలకు పూట కూడు పెట్టని వారు, పిల్లలకు, ఇతరులకు గుక్కెడు కాఫీ ఇవ్వనోళ్లు ఎందరో ఉన్నారు. 

స్వయాన ఏపీ స్పీకర్‌ కోడెల మహిళా ప్రతినిధుల సదస్సులో దలైలామాతో పాటు పలువురు ఉండగానే ఆడవాళ్లపై అఘాయిత్యాలకు వారి వేష భాషలు కారణమని, కాబట్టి వంటింటికే పరిమితం కావాలన్నాడు. రోజా చేసే వ్యాఖ్యలు, ఆమె చేసే సంజ్ఞలు, ఆమె వాడే భాష నీచంగా ఉంటాయి. ఇంకా నన్నపనేని రాజకుమారి, భవానీ వంటి నేతలు, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తమ శీలం మీద కూడా మగవారిపై నిందలు మోపే వారున్నారు. 

దేశంలో ఎవరో రేపు చేస్తే మగాళ్లందరినీ అదే గాటన కట్టి 'మృగాళ్లు' అనే హెడ్డింగ్‌లు చూస్తున్నాం. మరి ఆత్మాభిమానం ఏ మహిళలకో, దళిత, బడుగు బలహీన వర్గాలకు మాత్రమే కాదు.. అందరికీ ఉంటుంది కదా...! మన దేశంలో మహిళ స్వేఛ్చను, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులను తప్పుదారి పట్టించే వారు అధికమవుతున్నారని ఎందరో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పును తప్పు అని ఒప్పుకుందాం.. అది మగాడైనా ఆడైనా, అగ్రవర్ణమైనా, దళిత వర్ణమైనా...! 

Also Respond to Those Comments..!:

Chalapati Rao's recent comments to women are fraudulent. When he sings it, he has got some thoughtful questions. Balayya 'was stomaching', Ali's lady's belly was not comparable to the benz circle. Samantha is very sweet. Anchor insulted all of Anasuya to Suma. Also Respond to Those Comments
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs