ఒకప్పటి బీహార్ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత ఈ మధ్య కొన్ని వివాదాస్పద కామెంట్లు చేశాడు. వాజ్‌పేయ్‌ని మోదీ అండ్ కో మత్తులో ఉంచారని, ఆయనకు రాజకీయాలు తెలియకుండా చేస్తున్నారన్నాడు. మరోవైపు బిజెపి సీనియర్ నాయకుడు ఎల్.కె. అద్వానిని ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీ అండ్ కో రాష్ట్రపతిని చేయరని వ్యాఖ్యానించాడు. తాజాగా లాలూ పై సీబిఐ అటాక్ జరిగింది. వాటి తర్వాత లాలూ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే ఆయన మోదీపై కక్ష్యతోనే అంటున్నాడని ఎవరైనా భావించేవారు.
కానీ లాలూ ఈ వ్యాఖ్యలను చాలా రోజుల కిందటే చేశారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా అద్వానీ విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవి నిజమేనేమో అనే అనుమానం రాకమానదు. బాబ్రీ మసీదు కూల్చివేతలో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతిలపై ఉన్న కుట్ర కేసును 2011లోనే అలహాబాద్ హైకోర్టు కొట్టి వేసింది. కానీ ఈ కేసును మరలా పునర్విచారణ చేపట్టాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. ఇక అద్వానీతో సహా అందరూ కోర్టులకు హాజరుకావాల్సిందేనని, ఎవ్వరీకీ మినహాయింపు ఉండవని కోర్టు తేల్చిచెప్పింది. ఈ కేసును నెలలో ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేయాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలతో పాటు పలు ఇతర అభియోగాలను కూడా అద్వానీ తదితరులపై చేర్చే అవకాశాన్ని కోర్టు ఇచ్చింది.
ఎవరు ఎన్ని చెప్పినా న్యాయస్థానాలలో కీలకమైన కేసులు నీరు గారి పోవడానికి, శత్రువులపై పట్టు మరింత బలపరచడానికి కేంద్రాలు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాయని, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి చేతిలో సీబీఐ కీలుబొమ్మ అనేది భారత ప్రజాస్వామ్యంలో అందరికీ తెలుసు. ఇప్పటికే మోదీ చేతనే అద్వానీని నాకు రాష్ట్రపతి పదవి వద్దు అనే మాటను అనిపించిన నాయకులు ఇప్పుడు అద్వానీని మరింతగా పార్టీలో ఒంటరిని చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు. మరి గోద్రా అల్లర్లను కేసులను మరలా తిరగదోడేలా ఎవరైనా చేయగలరా? అనేది ఆలోచించాల్సిన విషయం...!