Advertisement
Google Ads BL

చిరు.. టా.. టా... చెప్పేశాడా..?


గత రెండు నెలలుగా బుల్లితెర మీద మీలో ఎవరు కోటీశ్వరు అంటూ సందడి చేసిన చిరంజీవి... ఆ షో లో చాలా మంది సెలబ్రిటీస్ తో హడావిడి చేశాడు. అయితే గత మూడు సీజన్స్ లో మీలో ఎవరు కోటీశ్వరుడి షో కి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున ఆ షో నుండి తప్పుకున్నాడు. ఇక నాలుగో సీజన్ కి హోస్ట్ గా చిరంజీవి వచ్చాడు. అయితే ఈ షో కి నాగార్జున చేసినప్పుడు వచ్చిన టీఆర్పీ రేటింగ్స్ చిరు హోస్ట్ గా చేసినప్పుడు రాలేదనే ప్రచారం బాగా జరిగింది. ఎలాగోకలా సెలబ్రిటీస్ వీక్స్ అంటూ ఈ షో ని 60  ఎపిసోడ్స్ సక్సెస్ ఫుల్ గా నడిపించిన చిరంజీవి ఈ బుధవారం రాత్రితో ప్రేక్షకులు అభిమానుల వద్ద సెలవుతీసుకొని ఈ షో కి టాటా చెప్పేశాడు.

Advertisement
CJ Advs

ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు లాస్ట్ ఎపిసోడ్ లో లెజెండ్రీ డైరెక్టర్ కె. విశ్వనాధ్ ని ఘనంగా సత్కరించి మరీ ఈ షో ని గ్రాండ్ గా ముగించేశాడు చిరు. మరి చిరు నెక్స్ట్ స్టెప్ ఏంటనే దానిమీద అప్పుడే హాట్ హాట్ చర్చ మొదలైపోయింది. అయితే చిరంజీవి తన 151వ చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రం కోసం మీలో ఎవరు కోటీశ్వరుడి షో ని ముగించేశారనే టాక్ వినబడుతుంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రామ్ చరణ్ నిర్మాణ సారధ్యంలో చిరు 151 వ చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చిరు రెడీ అవుతున్నాడట. ఇక ఈ చిత్రాన్ని చిరంజీవి పుట్టిన రోజు కానుకగా ఆగష్టు లో మొదలు పెట్టనున్నారని సమాచారం. 

Chiranjeevi is Side in MEK Show..!:

Chiranjeevi, who is the one who has been in the past for the last two months, is the one who has made a litile screan  of celebries in the MEK show. This is the name of you who is the director of the legendary in the last episode of the billionaire K. Vishwanath is greatly honored and ending this show.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs