Advertisement
Google Ads BL

అల్లు అరవింద్ కోర్టు మెట్లెక్కుతున్నారట..!


రాజమౌళి డైరెక్ట్ చేసిన 'మగధీర' 2009  లో విడుదలై టాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్బుని సృష్టించి రికార్డులని తిరగరాసింది. ఆ చిత్రంతో రామ్ చరణ్ ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. ఈ చిత్రాన్ని నిర్మించిన గీత ఆర్ట్స్ వారు కూడా బాగానే వెనకేసుకున్నారు. అయితే ఇన్ని రోజుల తర్వాత ఈ 'మగధీర' గురించి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. 'మగధీర' నిర్మాతలైన అల్లు అరవింద్ కోర్టు మెట్లెక్కుతున్నారట. ఎందుకంటే 'మగధీర' చిత్రాన్ని కాపీ చేసి బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్- కృతి సనోన్ జంటగా 'రాబ్తా' మూవీని నిర్మించారని..... 'రాబ్తా' ట్రైలర్ చూసిన మగధీర దర్శకులు దానిపై కోర్టుకెళ్లడానికి రెడీ అయ్యారట

Advertisement
CJ Advs

ఇక 'రాబ్తా' ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి ఆ చిత్రం 'మగధీర' కాపీ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. 'రాబ్తా' మొత్తం 'మగధీరని' పోలి ఉండడంతో 'మగధీర' నిర్మాతలు ఆ సినిమాపై కోర్టుమెట్లెక్కారు. అయితే 'మగధీర' రైట్స్ ని కొని ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో తెరకెక్కించాలని అప్పట్లో ప్రయత్నాలు జరిగాయి. కానీ అది ఎందుకో కుదరలేదు. కానీ ఇప్పుడు 'రాబ్తా' నిర్మాత, దర్శకుడు దినేష్ జైన్ ప్రీమేక్ అంటూ ఈ చిత్రాన్ని తెరకెక్కించేశారు. మరి రీమేక్ రైట్స్ కొనకుండా ఇలా సినిమాని మక్కికి మక్కి కాపీ చేసెయ్యడంతో ఇప్పుడు అల్లు అరవింద్ కోర్టు ద్వారా తేల్చుకోవడానికి సిద్హమయి హైకోర్టు ని ఆశ్రయించగా.... రాబ్తా మేకర్స్ కు హైద్రాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

ఇక హైకోర్టు విచారణని జూన్ 1 కి  వాయిదా వేసింది. మరి  సినిమానెమో జూన్  9న  విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. అయితే కోర్టు సమస్యలు ముగిసి జూన్ 9న 'రాబ్తా'  సినిమా విడుదలవుతుందో లేదో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Case File on Bollywood Movie Raabta..!:

'Magadheera' directed by Rajamouli was released in 2009 and set up a record 100 crore club in Tollywood. Allu Aravind courts are making 'Magadheera' producers. Because Sushant Singh Rajput and Kruti Sanon are in Bollywood with the copy of 'Magadheera' and produced the 'Raabta' movie.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs