అల్లు అర్జున్ కామెడీ పంచ్ లు పేలిస్తే ఎలా ఉంటుందో 'జులాయి, రేసుగుర్రం, S/o సత్యమూర్తి' చిత్రాలు చూస్తే తెలిసిపోతుంది. 'S/o సత్యమూర్తి' లో 'దేవుడా....' అనే పదం మాత్రం ఎప్పటికి మర్చిపోలేనిది. ఇక తాజాగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ 'డీజే... దువ్వాడ జగ్గన్నాధం' చిత్రం కూడా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని సమాచారం. గత చిత్రం 'సరైనోడు'లో ఊర మాస్ డైలాగ్స్ తో రెచ్చిపోయిన అల్లు అర్జున్ 'డీజే' లో మాత్రం బాగా కామెడీ పండిస్తాడట.
'డీజే'లో బ్రాహ్మణుడిగా మంత్రాలూ వల్లిస్తూ చేసే కామెడీ చిత్రానికే హైలెట్ అంటున్నారు. అలాగే ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్ కంటే కామెడీ పంచ్ డైలాగ్స్ ఎక్కువ వుంటాయని.... క్లైమాక్స్ కూడా సరదాగా కామెడీగా సింపుల్గా ఉంటుందని వినికిడి. స్టోరీ ని బట్టి క్లైమాక్స్ ని కూడా కామెడీ డైలాగ్స్ తో నింపేశారంట. మరి ఎంతపెద్ద కామెడీ ఎంటర్టైనర్ అయినా కూడా చివరిలో యాక్షన్ కే ఎక్కువ చోటుంటుంది. కానీ 'డీజే' లో మాత్రం యాక్షన్ కంటే కామెడికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెబుతున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్న ఈ చిత్రం పాటలు ఒక్కొక్కటిగా మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన 'శరణం... భజే.. భజే' సాంగ్ బాగా ఆకట్టుకుంటున్నది. జూన్ 23న విడుదల కానున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత.