Advertisement
Google Ads BL

సూపర్ స్టార్ కొత్త టైటిల్ ఇదే!


తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై తమిళనాట పెద్ద గందరగోళ పరిస్థితి ఏరపడింది. కొందరు రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే మరికొందరు ఆయన రాజకీయ ఎంట్రీని స్వాగతిస్తున్నారు. ఇక రజినీకాంత్ మాత్రం ఎప్పటిలాగే మౌనం వహిస్తూ అందరిని కన్ఫ్యూషన్ లో పడేస్తున్నారు. ఇక రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి అల్లుడు ధనుష్ ఫుల్ సపోర్ట్ చేస్తూ విమర్శకులకు గట్టి సమాధానం చెబుతున్నాడు.

Advertisement
CJ Advs

ఇదంతా ఇలా ఉంటె మరోవైపు రజినీకాంత్ సినిమాల మీద సినిమాలు పట్టాలెక్కిస్తూ బిజీగా వున్నాడు. ప్రస్తుతానికి 'రోబో 2 .0' లో నటిస్తున్న రజినీ తాజాగా 'కబాలి' డైరెక్టర్ రంజిత్ పా డైరెక్షన్ లో మరో మూవీని సెట్స్ మీదకి తీసుకెళుతున్నాడు. ఈ చిత్రం ఈ నెల 28 న ఆఫీసియల్ గా పూజా కార్యక్రమాలు చేసుకుని షూటింగ్ మొదలుపెడుతున్నారు. అయితే రజినీకాంత్ -రంజిత్ పా చిత్రం ప్రారంభానికి ముందే టైటిల్ ని ఎనౌన్స్ చేసేశారు. రజినీకాంత్ న్యూ మూవీ కోసం 'కాలా'  టైటిల్ ని కన్ఫర్మ్ చేసింది చిత్ర యూనిట్. ఈ రోజు ఉదయం రజినీకాంత్ న్యూ మూవీ టైటిల్ 'కాలా'ని రజినీకాంత్ అల్లుడు ధనుష్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.

అయితే రజినీకాంత్ కి ఈ సినిమా ప్రారంభం కాకముందే బెదిరింపులు కూడా వచ్చాయి. రజినీకాంత్ ని ఈ చిత్రంలో నటించొద్దంటూ కొందరు రజినీకి హెచ్చరికలు చేశారు. అయినా రజినీ ఏ బెదిరింపులకు భయపడకుండా ఈ చిత్రాన్ని స్టార్ట్ చేసేస్తున్నాడు. ఇక ఈ కాలా చిత్రానికి రంజిత్ ఫెవెరెట్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ పనిచేయనున్నాడు

Super Star Rajinikanth New Movie Title 'Kaala'..!:

Tamil superstar Rajinikanth is now in the interest of a political entrance.  All this is going on and on the other hand Rajinikanth is busy shooting on movies. Rajinikanth's new movie titled 'Kaala' was launched by Rajinikanth's son-in-law Dhanush's hands.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs