Advertisement
Google Ads BL

టిడిపికి ఇదేమీ దౌర్భాగ్యం..!


టిడిపి ఏర్పడింది కేవలం కాంగ్రెస్‌ వ్యతిరేక పోరాటాలతోనే. నేతలు చనిపోవచ్చు.. నాయకత్వాలు మారచ్చు కానీ సిద్దాంతాలు మర్చిపోతే మాత్రం అది వేశ్యతో సమానం. ఎన్టీఆర్‌ స్థాపించిన టిడిపి కాంగ్రెస్‌ వ్యతిరేకతతో కదం తొక్కిి ఇప్పుడు తెలంగాణలో పట్టుకోల్పోయింది. పార్టీలోని ఎమ్మెల్యేలందరూ అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇక ఆర్‌.కృష్ణయ్య కూడా తన బిసి మద్దతును బిజెపికి అప్పగించడానికి రెడీ అయ్యాడు. 

Advertisement
CJ Advs

ఇక మిగిలిన ఇద్దరు ముగ్గురితో టిడిపి నెట్టుకురావడం కష్టమవుతోంది. ఆంధ్రా వాళ్ల పార్టీగా టిడిపిని ఎండగట్టడంలో, వైసీపీని తన వంతగా మార్చుకోవడంలో కేసీఆర్‌ విజయం సాధించాడు. ఇక తెలంగాణలో టిడిపి కేవలం ఆంధ్రా పార్టీగా మారిపోయింది. రేవంత్‌రెడ్డి మాత్రమే పోరాటం చేస్తున్నాడు. అది కూడా రెడ్లలో ఐక్యత తెస్తున్నాడు. రెడ్ల ఐక్యతను చెడగొట్టడానికే తెలంగాణ మంత్రం ఉపయోగపడిందని అభిప్రాయపడుతున్నాడు. 

ఇక తాజాగా రేవంత్‌ కూడా పవన్‌ చెబుతున్న ఉత్తరాది-దక్షిణాది వ్యతిరేకత నిజమేనని, టిటిడి ఈవో విషయంలో పవన్‌ మాట్లాడింది నిజమేనంటున్నాడు. మరోవైపు తమకు ఆగర్భశత్రువు అయిన కాంగ్రెస్‌లోని రెడ్లను చూసి వచ్చే ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్‌, వామపక్షాలు, గద్దర్‌, జనసేన, కోదండరాంలతో కలవడానికి సిద్దంగా ఉన్నాడు. అదేమంటే పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ దెబ్బకు కాంగ్రెస్‌, వామపక్షాలు కలవలేదా? అంటున్నాడు. మరి బాబు మనసులో ఏముందో చూడాలి...!

What is The TDP Situation in Telangana..!:

The TDP was formed only with anti-Congress struggles. Leaders can die .. Leadership may change but the doctrines forget that it is equal to the prostitute. Recently, Revanth reddy, Pavan said the north-south opposition is true and Pawan spoke to TTD Eao.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs