పార్లమెంట్‌లో కేవలం ఇద్దరు ఎంపీలున్న స్థానం నుంచి హిందుత్వాన్ని, కాశ్మీర్ వంటి నినాదాలను తీసుకుని, అయోధ్య సమస్యతో బిజెపి నేడు స్వయంగా మెజార్టీ స్థానాలను దక్కించుకునే స్థాయికి ఎదిగింది, దేశంలోని దాదాపు అన్ని కుహనా లౌకిక పార్టీలు, మైనార్టీల బుజ్జగింపుపై ఆధారపడి,కుల పునాదుల మీదు మనగడ సాగిస్తున్న సమయంలో బిజెపి తీసుకున్న ఎత్తుగడలో ఎలాంటి తప్పు లేదు. మతపరంగా అంటే దేశం కేవలం మూడు నాలుగుగా మాత్రమే చీలిపోతుంది.
ప్రజలు మూడు నాలుగు ప్రధాన మతాల వారి పట్ల ద్వేషం పెరగవచ్చు. కానీ కులం అలాంటిది కాదు. ఒక్క హిందు సమైఖ్యతను కూడా వేల కొద్ది కులాలుగా విభజించే మృతృశకటం. ఇక అనాదిగా ముస్లింల పాలనలో, వారి దండయాత్రలలో నలిగిపోయి, బ్రిటిష్ క్రిస్టియానిటీలో చిదిమిపోయిన ఉత్తరాదిలోనే అందునా ముస్లింలు, ఇతర మతస్థుల హవా ఉన్న రాష్ట్రాలలో బిజెపికి హవా పెరిగింది. దక్షిణాదిలో ఆ తరహా విధ్వంసం కేవలం కర్ణాటకలో ఎక్కువగా జరిగింది కాబట్టి హిందు మతతత్వ పునాదులతో కర్ణాటకలో బిజెపి బలం పుంజుకుంది.
కాగా ఇప్పుడు మోదీ, అమిత్‌షాలు పూర్తిగా దక్షిణాది పథకం అమలు చేస్తున్నారు. నైజాం నవాబుల పాలనలో, రజాకార్ల విధ్యంసం హైదరబాద్‌లోనే కాదు తెలంగాణ అంతా తెలుసు. ఇక నేటి సీఎం కేసీఆర్ రజాకార్లకు, నైజాం హయాంలో ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయని చెబుతూ, ఓవైసీతో మంతనాలు జరుపుతూ, మత ప్రాదిపదికన రిజర్వేషన్లు అంటున్నారు. వీటినే తెలంగాణలో ముఖ్య అస్త్రాలుగా వాడుకోవాలని తెలంగాణ పర్యటనలో ఉన్న అమిత్‌షా తన స్థానిక నాయకులకు బోధించి, వచ్చే ఎన్నికల్లో ఒంటరిపోరేనని తేల్చిచెప్పాడు. మరి బిజెపి వ్యూహం తెలంగాణలో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచిచూడాల్సివుంది...!