Advertisement
Google Ads BL

మెగా ఫ్యామిలీకి అండగా సల్మాన్‌ సాయం..!


'బాహుబలి' చిత్ర విజయంలో కరణ్‌ జోహార్‌ పాత్ర గణనీయమైనది. ఇక భవిష్యత్తులో కూడా మన దర్శక నిర్మాతలు, హీరోలు బాలీవుడ్‌లో స్నేహాల కోసం అర్రులు చాచవచ్చు. ఇక విషయానికి వస్తే మెగా ఫ్యామిలీతో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌కి మంచి బంధం, అనుబంధం ఉన్నాయి. రామ్‌ చరణ్‌ చేసిన 'జంజీర్‌' (తుపాన్‌)కి సల్మాన్‌ అండగా నిలబడ్డాడు. కానీ ఆ చిత్రం విజయం సాధించలేదు. దాంతో స్వయంగా చరణ్‌కి, చిరుకి ఫోన్‌ చేసి మరీ సారీ చెప్పాడనే వార్త కూడా హల్‌చల్‌ చేసింది. 

Advertisement
CJ Advs

ఆ తర్వాత సల్మాన్‌ తన సొంత బేనర్‌లో కూడా రామ్‌ చరణ్‌ హీరోగా మరో బాలీవుడ్‌ చిత్రం నిర్మించడానికి ప్రయత్నాలు చేసింది కూడా నిజమే. కానీ చరణ్‌ కాస్త గ్యాప్‌తో వస్తానని చెప్పడంతో సల్మాన్‌ ఖాన్‌ కూడా కాస్త వెనక్కి తగ్గాడు. ఇక చిరంజీవి కూడా 'జెంటిమేన్‌, ఆజ్‌ కా గూండారాజ్‌'లు చేసి బాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమే.కానీ నేటితరం వారికి చిరు గుర్తున్నాడో లేదో తెలియదు. ఇక త్వరలో చిరంజీవి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'ని భారీగా తన కుమారుడు చేత నిర్మిస్తూ, తాను నటిస్తున్నాడు. 

ఇందులో బాలీవుడ్‌ హీరోయిన్లతో పాటు మిగిలిన కీలక నటులు కూడా నటించే అవకాశం ఉంది. ఇక ఇందులో వీలుంటే సల్మాన్‌ ఖాన్‌ కూడా ఓ కామియో రోల్‌లోనైనా నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం మెగా స్టార్‌, మెగా పవర్‌ స్టార్‌లు ఈ చిత్రం విడుదల బాధ్యత, ప్రమోషన్‌ తీరు నుంచి పలు విషయాలలో సల్మాన్‌ నుంచి సలహాలు తీసుకుంటున్నారు. 

Salman Khan in Uyyalawada Narasimha Reddy Biopic!:

The role of Karan Johar in the success of the film 'Baahubali' is significant.  In the future, our producers and heroes will be enthusiastic for friendships in Bollywood. Bollywood star Salman Khan has a good relationship with mega family.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs