Advertisement
Google Ads BL

వయసుకి గౌరవం ఇస్తున్న స్టార్‌..!


తాను ఒకప్పుడు యువ సమ్రాట్‌ అయి ఉండవచ్చు. ఆ తర్వాత 'మన్మథుడు', కింగ్‌గా పిలువబడే నాగ్‌ తనకు కాబోయే కోడలు సమంత తనని ఇంకా సార్‌ అని పిలవడం ఏమిటి? వద్దు.. మావయ్యా అని పిలవమని తానే చెప్పానని చెపుకొచ్చాడు. 60ఏళ్ల తాతల వయసులో కూడా అంకుల్‌ అనే పదాన్ని కూడా వినడానికి ఒప్పుకోని నాగ్‌ ఇప్పుడు మావయ్య అని పిలిపించుకోవడానికి చూపిస్తున్న ఆసక్తిని చూస్తుంటే నాగ్‌ తన వయసుకు ఎంత గౌరవం ఇస్తాడో అర్ధమవుతోంది. 

Advertisement
CJ Advs

ఇక ఆయన చెప్పినట్లు తన కొడుకుల కెరీర్‌పై కాన్‌సన్‌ట్రేషన్‌ చేసిన తర్వాత రెండుబ్లాక్‌ బస్టర్స్‌ ఇస్తానని మాట ఇచ్చాడు. అందులో మొదటి బ్లాక్‌ బస్టర్‌ 'రారండోయ్‌ వేడుక చూద్దాం' రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుండగా, అఖిల్‌ చిత్రం షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంతో 50కోట్ల క్లబ్‌లోకి చేరినా, ఆ చిత్రాన్ని అలా పిలవడం తనకిష్టంలేదని, 50కోట్లు, 100కోట్ల గురించి అసలు డిస్కషన్స్‌ వేస్ట్‌ అంటూ ఓపెన్‌ అయ్యాడు.

'బాహుబలి'తో మనం 1500కోట్ల క్లబ్‌లో ఉన్నామని, తమ స్థాయిని ఈ చిత్రం పెంచింది కాబట్టి విశాల దృక్పధంతో 'బాహుబలి' స్థాయిని చేరుకోవడం, దానికి మించిన టార్గెట్‌పెట్టుకుని, సినిమాను దేవుడిలా పూజించడం, గౌరవించడం నేర్చుకోమని 'బాహుబలి' మనకు తెలిపిందంటూ నిజాయితీగా ఓపెన్‌ అయ్యాడు నాగ్‌...!

Nagarjuna is Opened honestly..!:

He may have been once a young satra. After that, 'Manmadhudu', the Nag, known as King, is his fiancée calling Samantha to call him sir? Knowing how Nag respected his age.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs