Advertisement
Google Ads BL

చిరు.. రాజమౌళి ఇంటికి ఎందుకు వెళ్ళాడు..?


'బాహుబలి ద కంక్లూజన్' చిత్రంతో సంచలనాలను సృష్టించిన రాజమౌళికి టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ అభినందనలు తెలియజేశారు. ఇక రాజమౌళి తో సినిమా కోసం స్టార్ హీరోలు సైతం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. మరి ఒక్కసారిగా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా మారిపోయిన రాజమౌళితో ఏ హీరో సినిమా చేద్దామనుకోడు. కానీ రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఇప్పటి వరకు అనౌన్స్ చెయ్యలేదు. ఇక రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ హీరోతో ఉంటుందో అనే క్యూరియాసిటీ మాత్రం రోజురోజుకి పెరిగిపోతుంది. 

Advertisement
CJ Advs

బాహుబలి ఒక వైపు కలెక్షన్స్ వర్షం మరోవైపు ప్రశంసల వర్షంలో తడిసి ముద్దవుతుంది. ఇప్పటిదాకా 1500  కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా చరిత్రలో రికార్డులు నెలకొల్పింది. ఇంకా మరో రెండు వందల కోట్లు కొల్లగొట్టే దిశగా పరుగులుపెడుతుంది. సినిమా రిలీజ్ అయిన కొత్తలో సోషల్ మీడియా సాక్షిగా రాజమౌళిని ప్రశంసించించిన చిరంజీవి ఇప్పుడు డైరెక్టుగా రాజమౌళి ఇంటికి వెళ్లిమరీ అభినందనలు తెలిపాడు. అయితే ఇప్పుడు చిరు, రాజమౌళి ఇంటికి వెళ్లడంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. బాహుబలి లాంటి కళాకండాన్ని తీసి తెలుగు వాడు పేరు మార్మోగించిన రాజమౌళిని పర్సనల్గా అభినందించేందుకు వెళ్లిన చిరు ఇంకొన్ని విషయాలు రాజమౌళితో చర్చించాడనే ప్రచారం జరుగుతుంది.

అదేమిటంటే చిరంజీవి తన నెక్స్ట్ సినిమా చెయ్యమని రాజమౌళిని అడిగాడా? లేకపోతె అల్లు అరవింద్ 500  కోట్ల ప్రాజెక్ట్ ని రాజమౌళిని డైరెక్ట్ చెయ్యమని అడగడానికి వెళ్లాడా? లేకపోతె రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాని రాజమౌళి డైరెక్షన్ లో చెయ్యమని అడిగాడా? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సు అంటున్నారు. మరోవైపు చిరు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమా గురించి రాజమౌళి కూడా కొన్ని విషయాలు చిరుని అడిగి తెలుసుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది.

Chiranjeevi Why Did Go to Rajamouli's House?:

Rajamouli, who created sensations with the film 'Baahubali The Conclusion', has congratulated all Tollywood celebrities.  Chiranjeevi has now go to direct and congratulates her to Rajamouli's house.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs