కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, మోదీపై ఏపీలోని టిడిపి నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ముఖ్యంగా మోదీ జగన్‌కి అపాయింట్‌మెంట్ ఇచ్చినప్పటి నుంచి ఇది బాగా పెరిగింది. గత ఎన్నికల్లో బిజెపితో పొత్తు కారణంగా టిడిపికి సీట్లు తగ్గాయని, లేకపోతే మరింత భారీ విజయం సాధించే వారిమని కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.. కిందటి ఎన్నికల్లో మోదీ హవా, పవన్ ప్రచారం టిడిపికి బాగా కలిసొచ్చిన అంశాలని ఎవరైనా ఒప్పుకుంటారు.
ఇక మరో టిడిపి ముఖ్యనాయకుడు రాజేంద్ర ప్రసాద్ అయితే బిజెపిపై ఒంటి కాలితో లేచాడు. దీంతో బిజెపి నాయకులు కూడా అమీతుమీకి సిద్దమవుతున్నారు. మౌనంగా ఉంటున్న కన్నా లక్ష్మీనారాయణ సైతం ముందుగా తన కింది స్థాయి నాయకుల చేత బిజెపిని తిట్టించి, ఆ తర్వాత వారు అలా మాట్లాడి నందుకు బాబు వారికి క్లాస్ పీకాడు అనే ప్రచారం చేయడం మామూలై పోయిందని బిజెపి నాయకులు అంటున్నారు అదే నిజమనే విధంగా తాజాగా ఎంపీ కేశినేని నానిని, ఎమ్మెల్సీ రాజేంప్రసాద్‌లకు బిజెపి తిట్టినందుకు బాబు వారికి క్లాస్ పీకాడని అంటున్నారు. బిజెపి నేతలు చెప్పినట్లుగానే ఈ వార్తలు రావడంతో ఇది నిజమేనేమో అనే ధర్మసందేహం వస్తోంది.