Advertisement
Google Ads BL

వ్యూహాత్మక మౌనం పాటిస్తున్న కేసీఆర్‌..!


కేంద్రంలో ప్రత్యేక తెలంగాణకు మద్దతు తెలిపిన బిజెపి, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటాలు చేసిన టిఆర్‌ఎస్‌లు అధికారంలోకి వచ్చాయి. కాంగ్రెస్‌ మాత్రం తెలంగాణ మూలంగా ఏపీలో అడ్రస్‌ లేకుండా పోతే, తెలంగాణ ఇచ్చిన తమని ప్రజలు పట్టించుకోలేదు. ఇక ఏపీలో టిడిపి బిజెపితో పొత్తు పెట్టుకుని, ఎన్టీయే భాగస్వామిగా ఉంది.

Advertisement
CJ Advs

కానీ కేసీఆర్‌ మాత్రం మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా చాణక్యం చూపిస్తున్నాడు. తెలంగాణకు వ్యతిరేకంగా, ఇబ్బందులు పెట్టే విధంగా కేంద్రప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా చేయడంలో విజయవంతం అయ్యాడు. కేంద్రంలో భాగస్వామి అయిన ఏపీ టిడిపికి, ఏపీకి కంటే తెలంగాణకు ప్రధాని మోదీ అనుకూలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌కి పోటీగా ఎదగాలని భావిస్తున్న బిజెపి స్థానిక నాయకులు టీఆర్‌ఎస్‌ను తప్పుపడుతున్నా కూడా మిషన్‌ భగీరధతో పాటు పలు కార్యక్రమాలకు మోదీ వచ్చి తెలంగాణను, కేసీఆర్‌ పాలనను మెచ్చుకుంటున్నాడు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టిఆర్‌ఎస్‌, ఏపీలో వైసీపీలు తమకు అవసరమని బిజెపి అధిష్టానం భావిస్తోంది. దాంతో అమిత్‌షాతో పాటు స్థానిక బిజెపి నాయకులు టిఆర్‌ఎస్‌పై మండిపడుతున్నా కూడా కేసీఆర్‌ మోదీని కానీ, అమిత్‌షాని కానీ విమర్శించ వద్దని తన పార్టీ నాయకులకు ఆదేశాలిచ్చారట. మొత్తానికి కేసీఆర్‌ తాను చాణక్యుడినని చాటుకుంటున్నాడు. 

KCR Follows Silence Stratagic..!:

Supported by Telangana in the Center, the BJP and TRS, who fought for separate Telangana state, came to power.  In the next election, the BJP leadership hopes that they need in TRS and TS in YCp and AP.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs