Advertisement
Google Ads BL

ప్రేక్షకులు వెర్రివారు కాదు...!


బాహుబలి ప్రభంజనం చూసి ఈ చిత్రాన్ని పొగడక పోతే కుళ్లుతో ఉన్నారని, విమర్శిస్తే...ప్రపంచం అంతా సాహో అంటున్న చిత్రాన్ని విమర్శించడం ఏమిటి? అని వ్యాఖ్యానాలు వచ్చాయి. ఇక సినీ జోష్‌ ముందుగా చెప్పినట్లు నాలుగు నెలల కిందట విడుదలైన 'దంగల్‌' చిత్రం నోట్ల రద్దు పరిస్థితుల్లో కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది.

Advertisement
CJ Advs

కానీ 'పీకే'తో తన సత్తా చైనాలో ఎలా ఉందో తెలిసినా కూడా అమీర్‌ ఖాన్‌ 'దంగల్‌'ని చైనాలో విడుదల చేయడంలో కాస్త జాప్యం చేశాడు. వాస్తవానికి 'దంగల్‌' చిత్రం విడుదలైనప్పుడు మేధావుల నుంచి విమర్శకుల వరకు ఇలాంటి చిత్రాలు టాలీవుడ్‌లో ఎందుకు రావడం లేదు? మన వారు అలాంటి సబ్జెక్ట్‌లను ఎందుకు ఎంచుకోవడం లేదు? అనే దానిపై ఎస్పీ బాబు నుంచి ఎన్నో ప్రశ్నలు వచ్చాయి.

నిజానికి హృదయాలను కదిలించి, స్ఫూర్తిని నింపి, మహిళల సత్తాను చాటిన చిత్రం 'దంగల్‌'. ఈ చిత్రంలో ఓ నీతి, ఓ ఎమోషన్‌, దేశభక్తి, పట్టుదల ఉంటే ఏం సాధించవచ్చు.. అనే అనేక అంశాలు మిళితమై ఉన్నాయి. గ్రాఫిక్స్‌, విఎఫ్‌ఎక్స్‌లు, భారీ బడ్జెట్‌లు, విజువల్‌ వండర్‌లు ఈ చిత్రంలో లేక పోవచ్చు. అలాగని 'బాహుబలి'ని కించపరడం కాదు. 'దంగల్‌' గొప్పతనం గురించే చెప్పడం.

ఈ చిత్రాన్ని చైనాలో విడుదల చేస్తే ఏదో 'పీకే'లాగా 100, 200కోట్లు సాధించవచ్చని చాలా మంది భావించారు. కానీ చైనీయులు ఈ చిత్రాన్ని అద్భుతంగా ఆరాధించి ఏకంగా ఫుల్‌రన్‌లో 1000కోట్లు అందించేలా కనిపిస్తున్నారు.సో... 'బాహుబలి' రికార్డుకు కొన్నేళ్లపాటు తిరుగేలేదని, టిక్కెట్ల రేట్లు పెంచితేనే ఇది సాధ్యమని చాలా మంది భావించారు. ఇక దేశ సంస్కృతి, చారిత్రక చిత్రాలకు చైనీయులు పట్టం కడతారు.

కానీ 'బాహుబలి1'ని అక్కడ విడుదల చేస్తే భారీ నష్టాలు వచ్చాయి. మరి 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌'ను చైనాలో విడుదల చేసి 'దంగల్‌'ని దాటే సత్తా మనకు ఉందా? 'అవతార్‌' చిత్రానికి కూడా హాలీవుడ్‌ ప్రముఖులు నుండి విమర్శలు తప్పలేదు. తప్పుని తప్పు అని చెప్పడం, గొప్పని గొప్ప అని చెప్పడం కూడా తప్పేనా? 

Baahubali and Dangal Films Comparison in China:

If the film does not smoke and watch the film, it is with the kidneys and the criticism ... what does the world say about Saaho's story? There are comments. Do we have 'Baahubali-The Conclusion' released in China and 'Dangal'?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs