Advertisement
Google Ads BL

అఖిల్ జోడి కోసం షూటింగ్ ఆపేశారా..?


అఖిల్ - విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో ఒక చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే అఖిల్ తన రెండో సినిమా మొదలు పెట్టడానికి చాలా టైం తీసుకున్నాడు. కారణం మొదటి సినిమా అఖిల్ ఇచ్చిన ఫలితం. అఖిల్ షాక్ నుండి కోలుకోవడానికి అఖిల్ కి చాలా టైం పట్టేసింది. ఇక రెండో సినిమా విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో మొదలు పెట్టినప్పటి నుండి షూటింగ్ కి బ్రేక్ లేకుండా జరుపుతున్నారు. సినిమా మొదలై ఇన్నిరోజులైనా కూడా అఖిల్ కి ఈ చిత్రంలో హీరోయిన్ సెట్ కాలేదు. ఇప్పటి వరకు అఖిల్ కి జోడిగా బాలీవుడ్ చిన్నది అలియా భట్ ని సంప్రదిస్తున్నారనే వార్తలొస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అది ఫైనల్ కాలేదు. ఆ తర్వాత మేఘ ఆకాష్ ని అఖిల్ కి జోడిగా ఎంపిక చేస్తున్నారని వార్తలొచ్చినప్పటికీ అది కూడా అధికారికంగా ఎనౌన్స్ చెయ్యలేదు.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు అఖిల్ కి జోడిగా హీరోయిన్ సెట్ అవ్వని కారణంగా మూవీ షూటింగ్ కి బ్రేక్ పడిందని తెలుస్తోంది. అఖిల్ కి సరైన హీరోయిన్ దొరకకపోవడమే షూటింగ్ కి బ్రేక్ పడడానికి కారణమనే టాక్ మాత్రం స్ప్రెడ్ అయ్యింది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఒక షెడ్యూల్ లో యాక్షన్ సీన్లు షూట్ చేశారు. ఇక రెండో షెడ్యూల్ లో హీరోయిన్ కాంబినేషన్ లో సీన్లు ప్లాన్ చేశారట. కానీ హీరోయిన్ ఫైనల్ కాకపోవడంతో షూటింగ్ బ్రేక్ ఇచ్చారట. షూటింగ్ బ్రేక్ పడ్డప్పటి నుండి అఖిల్ కి బెస్ట్ పెయిర్ ని వెతికే పనిలో చిత్ర యూనిట్ తో పాటే నాగార్జున కూడా ఉన్నాడట.

Akhil and Vikram Kumar's Combo Film Stopped..!:

A film is being shot in a big way with Akhil-Vikram Kumar's combination. But now it seems that the shooting of the film has been broken due to the fact that the heroine is not set to be Akhil opposite.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs