Advertisement
Google Ads BL

చలపతి రావు స్పందించాడు..!


'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతి రావు ఆడవాళ్ళమీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి. ఆ ఆడియో వేడుకలో సదరు యాంకర్ గారు చలపతి రావు దగ్గరికి మైక్ పట్టుకుని వెళ్లి 'ఆడవాళ్లు దేనికి పనికొస్తారు' అని ప్రశ్నించగా... దానికి చలపతి రావు 'అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు' అని చాల అస్సహ్యమైన సమాధానము చెప్పగా అక్కడున్న అందరూ అదేదో కామెడీ అన్నట్టు నవ్వేశారు. ఇప్పుడు చలపతి రావు ఆడవాళ్ళ మీద చేసిన వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అలాగే మహిళా సంఘాలు కూడా చలపతి రావు వ్యాఖ్యల మీద మండిపడుతున్నారు. మరి వయసులో పెద్దవాడై వుండి ఇలాంటి వ్యాఖ్యలు తగునా అని కూడా ఆయన మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేఖత వ్యక్తమవుతున్న వేళ చలపతి రావు స్పందించాడు.

Advertisement
CJ Advs

నా మీద ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ లో ఒక్క రిమార్క్ కూడా లేదని.... తనకి ఆడవాళ్లంటే చాలా గౌరవమని... వారి మీద నేను ఇలా మాట్లాడం సరికాదని... ఏదో యాంకర్ అడిగిన ప్రశ్నకి తొందరలో అలామాట్లాడేశానని... అప్పటి నుండి చాలా పశ్చాత్తాప పడుతున్నానని చెబుతున్నాడు.  అలా చెబుతూనే టివి ఛానళ్లలో ఇలాంటి బూతు, ద్వందార్ధ సంభాషణలు ఉన్న షో చాలానే వున్నాయి. మరి అలాంటి వాటి మీద మహిళా సంఘాలు ఎందుకు వ్యతిరేఖత వ్యక్తం చెయ్యవు. నేను ఏదో హడావిడిలో అన్నమాటలు ఇంతలా రాద్ధాంతం చెయ్యాల్సిన అవసరం ఏముందని కూడా అంటున్నారు. అయినా బుగ్గ గిల్లి జోలపాడడం అంటే ఇదేనేమో. వయసులో అంత పెద్దవాడు ఇలాంటి మాటలు అసలు మాట్లాడొచ్చా... ఇకనుంచైనా ఆయన కొంచెం తన పద్దతి మార్చుకుంటే బావుంటుందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

Chalapathi Rao Responded..! :

Let's look at the 'Randhandhi Veduka Chuddam' at the audio event of senior actor Chalapati Rao's comments on women now around his neck. The big media are raising the social media.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs