Advertisement
Google Ads BL

చరణ్‌కి తోడు దొరికినట్టేనా...?


తన తండ్రి రీలాంఛ్‌ మూవీ 'ఖైదీ నెంబర్‌150'తో నిర్మాతగా డబ్బుల రుచి మరిగాడు రామ్‌ చరణ్‌. కాగా ప్రస్తుతం తన తండ్రితో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'ని మొదలుపెట్టనున్నాడు. స్టోరీ దాదాపు ఫైనల్‌ కావచ్చింది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఆగష్టులో చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తారని సమాచారం. ఇక నటీనటులనే కాకుండా ప్రొడక్షన్‌ డిజైనర్‌, ఆర్ట్‌డైరెక్టర్స్‌గా పలువురు ప్రముఖులను పెట్టుకున్నారు. 

Advertisement
CJ Advs

కెమెరామెన్‌గా కూడా బాలీవుడ్‌కి చెందిన రవి వర్మన్‌ని ఎంపిక చేశారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. దీనికోసం ఆయా భాషల్లోని ప్రముఖులను ఎంపిక చేసుకుంటూ తమ చిత్రానికి షూటింగ్‌ మొదటి రోజు నుంచే భారీ హైప్‌ తేవడానికి రెడీ అవుతున్నారు. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని కొణిదెల బేనర్‌లో నిర్మిస్తూ, తమిళ వెర్షన్‌కి లైకా మూవీస్‌ను సంప్రదిస్తున్నారు. తమిళ 'కత్తి'కి రీమేక్‌గా తయారైన ఖైదీ నెంబర్‌ 150కి కూడా లైకా ప్రొడక్షన్స్‌ భాగస్వామ్యం వహించి, బాగానే లాభాలు గడించింది. 

ఇక ఈ అధినేతలతో అల్లు అరవింద్‌కు మంచి అనుబంధం ఉంది. ప్రస్తుతం లైకా సంస్థ శంకర్‌, రజనీ, అక్షయ్‌ కుమార్‌లతో '2.0' చిత్రాన్ని 400కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తోంది. త్వరలో నాగశౌర్య-సాయిపల్లవిల కాంబినేషన్‌లో ఓ ద్విభాషా చిత్రాన్ని ప్రారంభించనుంది. ఇక 'ఉయ్యాలవాడ' బాలీవుడ్‌ వెర్షన్‌ కోసం ధర్మప్రొడక్షన్స్‌కి చెందిన కరణ్‌ జోహార్‌తో మంతనాలు జరుగుతున్నాయని టాక్‌. 

Ram Charan is starting 'Uyyalawada Narasimha Reddy' Biopic..!:

Ram Charan, who is a tribute to his father, is a producer with his father's remake movie 'Khaidi Number150'. But now he is going to start 'Uyyalawada Narasimha Reddy' with his father.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs