సాధారంగా పలువురు హీరోలు ఉండే ఫ్యామిలీలో ఎవరిని మీకు ఇష్టమైన హీరో ఎవరు అంటే తమ కుటుంబంలోని హీరో పేరునే చెబుతారు. ఇక చిన్నప్పుడు కూడా అలాగే ఉంటారు. చిన్నప్పటి నుంచి తాము తమ ఫ్యామిలీ హీరోల చిత్రాలు ఎక్కువగా చూస్తూ ఉండటం, అదే హీరోలు తమతో ఆడుతూ, ఎత్తుకుంటూ ఉండటంతో చిన్నారులు కూడా అవే మాటలు చెబుతారు.
కానీ కొన్ని సార్లు ఇది రివర్స్ అవుతుంది. పెద్దయిన తర్వాత తమ ఫ్యామిలీ హీరోనే అని చెప్పాలని అర్ధమైనా చిన్నారులలో ఏ ద్వేష విద్వేషాలు ఉండవు. అందుకే పసివారిని దేవుళ్లతో పోలుస్తారు. ఇక విషయానికి వస్తే అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ పేరు అందరికీ తెలిసిందే. బన్నీకి కూడా వాడంటే ప్రాణం.
ఇంకా మూడేళ్లు కూడా రాని ఈ బుడతడును ఇటీవల ఓ వీడియో తీస్తూ నీ పేరేమిటి? అని ప్రశ్నిస్తే అయాన్ అని చెప్పాడు. మీ ఫాదర్ నేమ్ అని అడిగితే అల్లు అర్జున్ అని ఠక్కీమని చెప్పాడు. ఇక ఈ బుడతడిని సైకిల్‌పై తొక్కేటప్పుడు మాత్రం నీవెవరు? అని అడిగితే నేను మహేష్ బాబుని అని గర్వంగా చెప్పుకున్నాడు. బహుశా 'శ్రీమంతుడు' చిత్రంలో మహేష్ సైకిల్ తొక్కడం ఈ పిల్లాడిని బాగా ఆకట్టుకుందని అంటున్నారు.