Advertisement
Google Ads BL

బాబు, పవన్‌లపై చురక..!


ఏపీ బిజెపి ఫైర్‌బ్రాండ్‌ సోమువీర్రాజు మరోసారి నోరు విప్పారు. ఐపిఎల్‌ ఫైనల్‌లో ముంబై జట్టు ఒక్క పరుగు తేడాతో గెలిచిందని, అలాగే రాజకీయాలలో కూడా ఏమైనా జరగవచ్చని ఆయన తెలిపారు. 2019వరకు బిజెపికి టిడిపితో పొత్తు ఉంటుందని, ఆ తర్వాత ఏదైనా జరగవచ్చని ఆల్‌రెడీ తమ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పిన విషయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ఏపీలో బిజెపి స్వయంగా ఎదగడం అందరూ చూస్తారని వ్యాఖ్యనించాడు. 

Advertisement
CJ Advs

ప్రధాని మోదీని జగన్‌ కలవడంపై రాద్దాంతం చేసే వారి అవగాహనారాహిత్యనికి ఇది నిదర్శనమన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రులను చాలా మంది కలుస్తుంటారని, గతంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సీఎం చంద్రబాబును ఎన్నిసార్లు కలవలేదంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇక తమ పార్టీలో చేరడానికి యాక్టర్లు, రైటర్లు, మేధావులు చాలా మంది వస్తున్నారని ఆయన పరోక్షంగా పవన్‌పై, జనసేనపై చమక్కులు విసిరారు. మొత్తానికి రోజురోజుకి ఏపీలో బిజెపి, టిడిపిల మధ్య దూరం పెరగడం సామాన్యులకు కూడా బాగా అర్ధమవుతోంది. 

Somu Veerraju Comments on Chandrababu and Pawan Kalyan:

AP BJP Firebrand Somu Veerraju once again opened the mouth. He said the Mumbai team had won by one run in the IPL final, as well as in politics.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs