Advertisement
Google Ads BL

దిల్‌రాజు అసహనం ఎవరి మీద..?


నేటితరం నిర్మాతల్లో దిల్‌రాజు రూటే సపరేట్‌. ఆయన నిర్మించిన చిత్రాలు హిట్‌ అవుతాయి అనేకంటే ఆయన హిట్‌ అయ్యే చిత్రాలను సరిగ్గా జడ్జ్‌ చేయగలడనే చెప్పాలి. ఆయనకు ఓ హీరోతో ఎంత బడ్జెట్‌ అయితే వర్కౌట్‌ అవుతుంది? సినిమాను ఎన్నిరోజుల్లో తీయాలి? వంటి వాటిపై మంచి అవగాహన ఉంది. దానికి తగ్గట్టుగా ఆయన తన చిత్రాల కథలను, హీరోలను, దర్శకులను ఎంపిక చేసుకుంటూ ఉంటాడు. కాగా ఆయన ప్రస్తుతం అల్లు అర్జున్‌-హరీష్‌ శంకర్‌లతో 'డిజె' ( దువ్వాడ జగన్నాథం) చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 

Advertisement
CJ Advs

మరోపక్క మరో యంగ్‌ మెగా హీరో వరుణ్‌ తేజ్‌తో శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో 'ఫిదా' చిత్రం తీస్తున్నాడు. ఇక 'డిజె'కు మంచి పాజిటివ్‌ బజ్‌ ఉండటం, సినిమాకు మంచి బిజినెస్‌ జరుగుతుండటం ఆయనకు ఆనందాన్ని కలిగిస్తున్నా కూడా 'ఫిదా' చిత్రం విషయంలో మాత్రం ఆయన కాస్త అసంతృప్తిగా ఉన్నాడంటున్నారు. ఆయన భార్య ఆకస్మిక మరణం మూలంగా ఆయన కొంత మౌనంగా ఉన్నాడు. ఇక 'ఫిదా' చిత్రం షూటింగ్‌ ఎక్కడి వరకు వచ్చింది? అవుట్‌పుట్‌ ఎలా ఉంది? ఎప్పుడు రిలీజ్‌ చేయాలి? అనే విషయాలు దిల్‌రాజుకే అర్ధం కావడం లేదట. 

శేఖర్‌కమ్ముల కూడా అనుకున్న సమయంలో చిత్రాన్ని తీయగల సమర్ధుడే. కానీ ఆయన ప్రస్తుతం ఫామ్‌లో లేడు. మరోవంక మెగాహీరో వరుణ్‌ తేజ్‌ 'లోఫర్‌, మిస్టర్‌' చిత్రాల ఎఫెక్ట్‌ నుంచి ఇంకా కోలుకోలేదంటున్నారు. దాంతో ఆయన డిప్రెషన్‌లో ఉన్నాడని, ఏదైనా ఫంక్షన్‌కి పిలిచినా వెళ్లడం లేదని, 'ఫిదా' విషయంలో కూడా ఆయన సరిగ్గా ఇన్‌వాల్వ్‌ అయి నటించలేకపోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి 'ఫిదా' ఎవరికి ఎలాంటి ఫలితాలను అందిస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Dil Raju is Discontent on Fida Movie:

He is currently producing Allu Arjun-Harish Shankar 'Dj' (Duvvada Jagannadham). On the other hand, another young mega hero Varun Tej is acting the film 'Fida' directed by Sekhar kammula.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs