Advertisement
Google Ads BL

సెలబ్రిటీస్ కి మీడియా చుక్కలు చూపెడుతుంది!


ఈ మధ్యన  తిరుపతికి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకుంటున్న సెలబ్రిటీస్ కి మీడియా చుక్కలు చూపెడుతుంది. వారిని తమ కెమెరాల్లో బంధించడానికి మీడియా నానా తంటాలు పడుతూ ఆయా సెలబ్రిటీస్ కి చికాకు తెప్పిస్తుంది. మొన్నామధ్యన రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి ల విషయం ఓవర్యాక్షన్ చేసిన మీడియా ఆ తర్వాత అల్లు అర్జున్, స్నేహ విషయంలోనూ అలానే చేసింది. గుడిలోపలికి మీడియాకి అనుమతి ఉండదు కాబట్టి మెయిన్ ద్వారం దగ్గర కాచుకుని వారు రాగానే అతిని ప్రదర్శిస్తూ తాము చేసిన పనికి ఏ మాత్రం సిగ్గుపడకుండా..... ఇంకా సెలబ్రిటీస్ కొంచెం అతి చేస్తున్నారంటూ న్యూస్ ని హైలెట్ చేసేస్తారు. మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ లు శ్రీవారిని దర్శించుకుని బయటికి వచ్చిన సమయంలో మీడియా వారు వారిని ఆపి ఫొటోస్, వీడియోస్ తీస్తుంటే లక్ష్మి వారిపై ఆగ్రహం వ్యక్తం చెయ్యడంతో .... తిరుమలలో మంచు లక్ష్మి ఓవరేక్షన్ అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు ప్రచారం అయ్యాయి.

Advertisement
CJ Advs

ఇప్పుడు కూడా తాజాగా సమంత విషయంలో అదే జరిగింది. సమంతకి నాగ చైతన్యతో పెళ్లి కుదిరి పెళ్లి డేట్ ఫిక్స్ అవడం సందర్భంగా సమంత శ్రీవారి దర్శనానికి తిరుపతికి వెళ్ళింది.  అక్కడ సమంత శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఆమెని చూడడానికి జనంతో పాటు మీడియా కూడా ఎగబడింది. మీడియా వాళ్ళు సమంత ని ఇబ్బంది పెడుతూ ఫొటోస్ అవి తీస్తూ తెగ ఇబ్బంది పెట్టేశారు. ఇక సమంత వారికి ఫోజులు ఇస్తూనే ఇబ్బందిని మొహం లో కనబడకుండా మేనేజ్ చేస్తూ వారికి దర్శనం బాగా జరిగింది అని చెప్పి కార్ లో ఆమె రూమ్ కి వెళ్లిపోయింది. 

మరి మీడియా సెలబ్రిటీస్ పట్ల ఇలా చెయ్యడం ఏం బాగోలేదని కొంతమంది తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీస్ ప్రైవసీని కోరుకుంటారని అలా కోరుకునే వారిని మీడియా ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదనే అంబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  

Celebrities Troubled to Media in Tirupati!:

Recently, the media drops to the celebrities who go to Tirupati and make their appearance.  The media bothers them to bind them in their cameras and shakes the celebrities.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs