Advertisement
Google Ads BL

డీజే సాంగ్ తో డ్యాన్స్ కు రెడీ కాండీ..!


అల్లు అర్జున్ తాజా చిత్రం 'డీజే.. దువ్వాడ జగన్నాధం' పాటలతో దున్నడానికి రెడీ అయ్యాడు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో కొత్త పాత్రలో ట్రై చేస్తున్న అల్లు అర్జున్ కి జోడిగా పూజ హెగ్డే నటిస్తున్న డీజే చిత్ర పాటల సందడి యూట్యూబ్ లో షురూ అయ్యింది. ఇప్పటికే టీజర్ తో యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తున్న ఈ డీజే చిత్రం ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో మరిన్ని సంచలనాలు సృష్టించడానికి రెడీ అవుతుంది.

Advertisement
CJ Advs

మెగా ఫ్యామిలీ ఆచారం ప్రకారం 'డీజే' చిత్రానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని గ్రాండ్ గా చేసి డీజే పాటల వేడుకని మాత్రం రద్దు చేసి ఒక్కో పాటని మార్కెట్ లోకి నేరుగా వదలడానికి చిత్ర యూనిట్ సకలం సిద్ధం చేసింది. సాయంత్రం 6 గంటలకు డీజే నుంచి ఓ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నారు. 'డీజే శరణం భజే భజే....' అనే లిరిక్స్ తో సాగే పాట మరికొన్ని గంటల్లో మార్కెట్లోకి విడుదల చెయ్యబోతున్నారు. ఇప్పటికే డీజే ఆడియో టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఇప్పుడు దేవిశ్రీ 'డీజే' ని ఎలాంటి మ్యూజిక్ తో ఇరగదీస్తాడో అనే క్యూరియాసిటీ తో ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ మొదటి సారి బ్రాహ్మణుడి గెటప్ లో కనిపిస్తున్నాడు. అంతేకాకుండా రొమాంటిక్ యాంగిల్ లో కూడా అల్లు అర్జున్ లుక్ సూపర్బ్ అనిపించేలా ఉంది. మొన్నామధ్యన  పూజ హెగ్డే తో కలిసి అల్లు అర్జున్ రొమాంటిక్ లుక్ ని వదిలింది చిత్ర యూనిట్. ఆ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరి ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసిన డీజే చిత్రం ఇప్పుడు సాంగ్స్ తో మరింత అంచనాలు పెంచే అవకాశం ఉందని అంటున్నారు. 

Dj-Duvvada Jagannadham's Movie Song Release on 22nd May 2017:

Allu Arjun's latest film 'Dj Duvvada Jagannadham' is going to be hit with songs. Allu Arjun is doing a new role in Harish Shankar Direction and Pooja Hegde is playing the lead role in YouTube this movie song ready. On the evening of 6pm, a single will be released from DJ.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs