ఇప్పుడు ఎక్కడ చూసిన కేన్స్ ఫెస్టివల్ లో హీరోయిన్స్ ఎలాంటి గ్లామర్ షో చేస్తారో అని సాధారణ ప్రేక్షకులు కూడా తెగ ఎదురు చూస్తున్నారు. ఇక కేన్స్ కి హాజరైన హీరోయిన్స్ అంతా తన అందాల ప్రదర్శనతో చూపరుల మతులు పోగొట్టేసారు. అందులో బాలీవుడ్ భామలకు ధీటుగా కోలీవుడ్ భామ శృతి హాసన్ కూడా ఈ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో గ్లామర్ షో తో అందరి చూపులు తనమీద పడేలా చేసుకుంది.
అయితే బాలీవుడ్ భామలు ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనె లకు ధీటుగా శృతి హాసన్ అలా అక్కడ కేన్స్ లో మెరవడానికి మాత్రం ఒక ప్రత్యేకమైన కారణం ఉందట. తమిళంలో భారీ బడ్జెట్ తో శృతి హాసన్ ముఖ్య పాత్రలో నిర్మితమవుతున్న సంఘమిత్ర చిత్రం ఓపెనింగ్ కోసం ఇలా ఆ చిత్రంలో నటించే నటీనటులు, టెక్నీకల్ టీమ్ మొత్తం కేన్స్ లో మెరిసింది. ఇక సంఘమిత్ర టీమ్ లోనే కాక కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో శృతి హాసన్ తన అందచందాలు, దుస్తుల ఆకర్షణతో హాట్ టాపిక్ గా మారింది.
మరి కేన్స్ వంటి ఫిలిం ఫెస్టివల్ కి హాజరైన శృతి హాసన్ స్టయిల్ గురించే ఇప్పుడు అందరూ తెగ చర్చించేసుకుంటున్నారంటే ఏ లెవల్లో శృతి హాసన్ తన అందాలతో రెచ్చిపోయిందో మీరు ఓ లుక్కేయండి.