Advertisement
Google Ads BL

రెండు ట్రైలర్స్‌ ఆసక్తికరంగా ఉన్నాయి...!


అదృష్టం అంటే అది రాజ్‌తరుణ్‌దే అని కొందరు అంటుంటారు. కానీ డైరెక్టర్‌ కావాలనుకున్న ఆయన తనదైన జడ్జిమెంట్‌తో మంచి చిత్రాలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా రచయితగా పేరున్న వెలిగొండ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం 'అంధుడు'. హీరో అంధుడైతే అదో ప్రయోగాత్మక చిత్రమని, ఆర్ట్‌ ఫిల్మ్‌, ఏడుపుగొడ్డు చిత్రం అని కొందరు భావిస్తుంటారు. కానీ అంధుడైన హీరోతో కూడా కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ని పండించవచ్చని ఈ చిత్రం ట్రైలర్‌చూస్తే అర్ధమవుతోంది. 

Advertisement
CJ Advs

గుడ్డోడు కదా రోడ్డు దాటిద్దాం అనుకునే అమ్మాయితో లవ్‌ ప్రపోజ్‌ చేయడం నుంచి, ఆమె నో అంటే అతను మాత్రం తన ఫ్రెండ్స్‌కి నేనే రిజక్ట్‌ చేశాను... అనే స్టైల్‌లో ఈ చిత్రం మొదటి పార్ట్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉండి, సెకండాఫ్‌ నుంచి సీరియస్‌ మూడ్‌లోకి వెళ్లేలాకనిపిస్తోంది. హిట్‌కపుల్‌ అయినా రాజ్‌తరుణ్‌-హెబ్బాపటేల్‌ల జంట, ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో హ్యాట్రిక్‌ మూవీ చేస్తున్న 'అంధగాడు' మెప్పించేలానే ఉన్నాడు. ఇక సీనియర్‌ వంశీ చిత్రాలంటే పడి చచ్చే ప్రేక్షకులు ఉన్నారు. 

ఇక జమజచ్చ అంటూ సాగే పాత లేడీస్‌టైలర్‌ రాజేంద్రప్రసాద్‌కి తనయుడిగా ఈ నయా ఫ్యాషన్‌ డిజైనర్‌ కూడా బాగా ఆకర్షిస్తున్నాడు. పాటల క్లిప్పింగ్‌లతో ట్రైలర్‌ నిండిపోయింది. గత కొంతకాలంగా సీనియర్‌వంశీ పరిశ్రమకు దూరంగా ఉన్నాడు. పెద్దగా ఫామ్‌లో కూడా లేడు. ఇక ఎమ్మెస్‌రాజు తనయుడు సుమంత్‌ అశ్విన్‌కి కూడా పెద్ద హిట్‌ లేదు. ఈ 'ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌'ని వంశీ దర్శకత్వంలో నిర్మిస్తున్న మదురా శ్రీధర్‌ కూడా మంచి టేస్ట్‌ ఉన్న వ్యక్తి అని ఈ ట్రైలర్‌ చూస్తేనే అర్ధమవుతోంది. 

Two Trailers are Interesting:

Good luck means that it is Raj Tarun. He is directing the film 'Andhhagadu' directed by Velagondha Srinivas. Some believe that the hero is an experimental film, art film and the film of crining.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs