Advertisement
Google Ads BL

చరణ్‌-సుక్కు ఏమి చేస్తున్నారు..?


రామ్‌ చరణ్‌ సినిమాలంటే అనుకున్న సమయానికి ఏదీ విడుదల కాదనే విమర్శ ఉంది. 'బ్రూస్‌లీ' వంటి ఒకటి అరా చిత్రాలు తప్ప అన్నీ పోస్ట్‌పోన్‌ అయిన చిత్రాలే. ఇక సుకుమార్‌ మంచి దర్శకుడే కానీ ఆయనది ఇదే పంధా. ఎప్పుడు మొదలుపెడతాడో? ఎప్పుడు రిలీజ్‌ చేస్తాడో? తెలియదు. ఇక వీరిద్దరితో మొదలైన చిత్రం ఎంతో ఆలస్యంగా పట్టాలెక్కింది. చరణ్‌ కాస్త ఆలస్యంగా సెట్‌లోకి వచ్చాడు. గోదావరి జిల్లాలలో వేగంగా షూటింగ్‌ జరుగుతున్నట్లు కనిపించింది. 

Advertisement
CJ Advs

ఇంతలో వేడి దెబ్బకు సమంతకు వడదెబ్బ తగలడంతో షూటింగ్‌కి ప్యాకప్‌ చెప్పేసి హైదరాబాద్‌ వచ్చేశారు. ఇక ఇంకా వేడి తగ్గకపోవడంతో కొన్నిరోజులు షూటింగ్‌ను వాయిదా వేశారని సమాచారం. మరోపక్క ఈ చిత్రంలో ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రావు రమేష్‌ కీలకమైన సమంత తండ్రి పాత్రను చేస్తున్నాడు. కానీ ఆయనను అర్ధాంతరంగా ఈ చిత్రం నుండి తప్పించి ఆ స్థానంలో ప్రకాష్‌రాజ్‌ని తీసుకున్నారట. దీనికి మెగాకాంపౌండే కారణమంటున్నారు. 

గతంలో 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో రాజ్‌కిరణ్‌ను తప్పించి ప్రకాష్‌రాజ్‌ను తీసుకోవడం, అది పలు విమర్శలకు కారణమైన సంగతి తెలిసిందే. ఇక 'గోవిండుడు' తరహాలోనే ఈ చిత్రంలో కూడా రావు రమేష్‌పై చిత్రీకరించిన సన్నివేశాలను మరో సారి ప్రకాష్‌రాజ్‌తో రీషూట్‌ చేయనున్నారని సమాచారం. దీంతో ఈ చిత్రం దసరా రేసులో ఉండేలా కనిపించడం లేదు. 

What are you Doing Sukumar and Ram Charan?:

There is criticism that none of Ram Charan's movies are released.  All except the one's aura like 'Bruce Lee' is the postpone of all. The movie started with a lot of late. Charan has come a bit late. There was a fast shooting in Godavari districts.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs