నరేంద్రమోదీ ప్రధాన మంత్రి పీఠం ఎక్కడానికి ముఖ్యకారణం అవినీతిపై పోరాటం అని ప్రకటించడమే. విదేశాలలో ఉన్న కోట్ల డబ్బులను బ్యాంకులకు ఎగ్గొట్టిన వారిని దేశానికి రప్పిస్తానని, విదేశాలలో మూలుగుతున్న భారతీయుల నల్లదనాన్ని దేశాభివృద్దికి ఉపయోగిస్తానని ఆయన కిందటి ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు ఈ రెండు విషయాలలో మాత్రం పురోభివృద్ది లేదు. దేశంలోని నల్లదనాన్ని వెలికితీసే పలు ప్రత్యామ్నయాలు ఉన్నప్పటికీ వాటి వల్ల ప్రజల్లో పెద్ద పేరు రాదని భావించిన మోదీ తన నిజాయితీని నిరూపించేందుకు పెద్దనోట్ల రద్దు వంటి ప్రజాకర్షక పథకాన్ని ఎన్నుకున్నారు.
ఇది ఇప్పటి వరకు సత్ఫతితాలను ఇవ్వలేకపోయింది. సామాన్యులు, మద్యతరగతి తప్ప బడా బాబులు హాయిగా దర్జాగా ఉంటున్నారు. తమ పాత నల్లధనాన్ని కూడా 2వేల నోట్ల రాకతో వైట్‌గా మార్చుకుంటున్నారు. ఇక ప్రధాని మోదీ ఇటీవల మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి, హోం మంత్రి చిదంబరం, ఆయన కుమారుడుతో పాటు లాల్ ప్రసాద్ యాదవ్ వంటి అవినీతి పరుల ఇళ్లలో సీబిఐసోదాలు జరిపించాడు. ప్రత్యర్ధుల, అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. మోదీ చర్యను పార్టీలకతీతంగా అందరూ హర్షిస్తున్నారు.
కానీ ఎప్పుడు ప్రక్షాళన, మార్పు అన్నవి తమ సొంత ఇంటి నుంచే ప్రారంభించాలి. బిజెపి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రుల వద్ద నల్ల సొమ్ములేదా? వెంకయ్యనాయుడు, నితిన్‌గడ్కరితో పాటు గాలి జనార్ధన్‌రెడ్డి దత్త సోదరి సుష్మాస్వరాజ్ ఇంటిని గాలి జనార్ధన్‌రెడ్డి కేజీల కొద్ది బంగారంతో గిఫ్ట్‌ల రూపేణా దోచిపెట్టి ఉన్నాడు. మరి వారందరూ మోదీకి కనిపించడం లేదా? మోదీ చేస్తున్నది మంచి పనే అయినా తరతమ బేధాలు లేకుంటేనే ప్రజలు హర్షిస్తారు. లేదా వీటిని రాజకీయ కక్ష్య సాధింపు చర్యలుగా భావిస్తారు...!