Advertisement
Google Ads BL

'కేశవ' తో నిఖిల్ ఇంకా రెచ్చిపోనున్నాడు..!


'బాహుబలి' హడావుడి తగ్గలేదు. కానీ విభిన్న చిత్రాలు చేస్తోన్న నిఖిల్‌, తనకు 'స్వామిరారా'తో బ్రేక్‌నిచ్చిన సుధీర్‌వర్మల కాంబినేషన్‌లో వచ్చిన 'కేశవ' చిత్రం భారీగానే థియేటర్లను సొంతం చేసుకోవడమే కాదు.. మంచి ఓపెనింగ్స్‌ని సాధించింది. దీంతో ఈ చిత్రం సినీ ప్రేమికులలో ఎంత క్యూరియాసిటీని కలిగించిందో అర్దమవుతోంది.

Advertisement
CJ Advs

'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో నోట్ల రద్దు సమస్యలను అధిగమించి, 'కేశవ'తో 'బాహుబలి2'కి పోటీగా నిలిచే ప్రయత్నం చేసిన నిఖిల్‌-సుధీర్‌వర్మలు మంచి ఫలితాలను రాబట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక నిఖిల్‌ విషయానికి వస్తే ఆయన నగేష్‌కుకునూర్‌తో ఓ చిత్రం చేయాల్సివుంది. కానీ దీనికి కాస్త టైం పట్టవచ్చునంటున్నారు. ఇక 'శంకరాభరణం' వంటి మాస్‌ రీమేక్‌తో దెబ్బతిన్న నిఖిల్‌ త్వరలో కన్నడ సూపర్‌హిట్‌ 'కిరాక్‌పార్టీ'లో నటించనున్నాడు. దీనిని 14రీల్స్‌సంస్థ నిర్మిస్తుండగా, రాజు సుందరం దర్శకత్వం వహించనున్నాడు. 

దీనితోపాటు దొంగ సర్టిఫికేట్ల కుంభకోణం ముఠాతో ఢీకొనే యువకుని కథగా తెరకెక్కిన తమిళ మూవీ 'కొణిదన్‌'లో కూడా నిఖిల్‌ నటించనున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని రవితేజతో పాటు పలువురు హీరోలు తిరస్కరించినప్పటికీ తనకున్న జడ్జిమెంట్‌తో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు విభిన్న చిత్రమవుతుందని భావించిన నిఖిల్‌ ఈ రీమేక్‌లో నటించనున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు వెర్షన్‌ను ఎవరు డైరెక్ట్‌ చేస్తారో క్లారిటీ లేనప్పటికీ తమిళంలో నిర్మించిన కళైపులి థానునే దీనిని తెలుగులో కూడా రీమేక్‌ నిర్మాతగా వ్యవహరించనున్నాడని తెలుస్తుంది. 

Keshava Hero Nikhil New Projects:

Actor Nikhil Siddharath Will be Next Seen in Kirik Party Telugu Remake.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs