Advertisement
Google Ads BL

లోకనాయకుడుకి ఇక డబ్బే ముఖ్యమంట!


55ఏళ్లకు పైగా సినీ రంగంలోనే ఉన్నప్పటికీ కమల్‌ తన వెనుక వేసుకున్న రాళ్లు తక్కువేనని అందరికీ తెలుసు. 'విశ్వరూపం' చిత్రం విషయంలో తేడా వచ్చినప్పుడు ఆయన తన ఆస్తులన్నింటినీ అమ్ముకోవాలని నిర్ణయించుకున్నాడు. కాగా గత కొంతకాలంగా కమల్‌హాసన్‌ బుల్లితెరపై కనిపించనున్నాడనే వార్త హల్‌చల్‌ చేస్తోంది. మొదట్లో దానిని అందరూ గాసిప్పే అనుకున్నారు. కానీ తమిళ బిగ్‌బాస్‌ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించడానికి కమల్‌ ఒప్పుకున్నాడు. విజయ్‌ టీవీలో ప్రసారం కానున్న ఈ ప్రోగ్రాం ప్రోమో ఆసక్తికరంగా ఉంది. బుల్లితెరపై ఎందుకు నటిస్తున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు కమల్‌ తలతిరిగిపోయే సమాధానం ఇచ్చాడు. 

Advertisement
CJ Advs

ప్రతి ఒక్కరు డబ్బు కోసం చేస్తున్నా కూడా సమాజానికి భయపడి ఏవేవో కాకమ్మకబుర్లు చెబుతుంటారు. కానీ కమల్‌ మాత్రం ఆ చానెల్‌ వారు నన్ను ఆ కార్యక్రమానికి అడిగారు. ఆ కార్యక్రమం చేయడం ద్వారా నేను నేటి తరానికి కూడా బాగా గుర్తుండిపోవచ్చని అనిపించింది. ఇన్నేళ్లుగా సినీ రంగంలో ఉన్నా ఎప్పుడు అలాంటి ఆసక్తి కలగలేదు. ఈ కార్యక్రమానికి నాకు ప్రేరణ కలగడానికి మూలం మాత్రం ఖచ్చితంగా ఆ చానెల్‌ వారు నాకు ఆఫర్‌ చేసిన పారితోషికం బాగా నచ్చడమే అని గట్టిగా చెప్పగలను. ప్రస్తుతం నాకు డబ్బు అవసరం వుంది. ఏం చేసినా నేను డబ్బు కోసమే అన్నాడు.

కాగా ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాల వల్ల కమల్‌ ఆల్‌రెడీ తనకు ఉన్న ఆస్తులను శృతిహాసన్‌, అక్షరహాసన్‌లకు సరిసమానంగా వీలునామా రాయించేశాడని సమాచారం. ఇది ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ది తమిళనాడుగా మారింది. 

Kamal Haasan to make his television debut with Bigg Boss:

Actor-filmmaker Kamal Haasan, who is gearing up for his television debut with Bigg Boss, says he wouldn’t mind directing a TV series if the money is good enough.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs