Advertisement
Google Ads BL

ఈ వేడుక వాయిదా పడటం లేదంట..!


అక్కినేని ఇంటి అల్లుడు, హీరో సుశాంత్‌ తండ్రి ఆకస్మిక మరణంతో నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా, 'సోగ్గాడే చిన్నినాయనా' ఫేమ్‌ కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగార్జున స్వయంగా తమ అన్నపూర్ణ బేనర్‌లో నిర్మించిన చిత్రం 'రారండోయ్‌ వేడుక చూద్దాం' విడుదల వాయిదా పడిందనే వదంతులు వ్యాపించాయి. ఈ చిత్రాన్ని ఈనెల 26న కాకుండా జూన్‌2కి మార్చారనే వార్తలు హల్‌ చల్‌ చేశాయి. కానీ ఇది నిజం కాదు. 

Advertisement
CJ Advs

ఈ చిత్రం వేసవి సెలవుల కానుకగానే ఫ్యామిలీ, యూత్‌, మాస్‌ ప్రేక్షకులను అలరించేందుకు ఈ నెల 26న భారీగా విడుదల కానుంది. మొదట్లో ఈ చిత్రంపై పెద్దగా హైప్‌ లేకపోయినా, టైటిల్‌ ప్రకటన తర్వాత, టీజర్‌, ట్రైలర్స్‌ రాకతో ఊపందుకుంది, ఈ చిత్రం నాగచైతన్యకు తొలిసోలో బ్లాక్‌బస్టర్‌ కానుందని అభిమానులు ఆనందంగా ఉన్నారు. సెకండ్‌ సినిమా సెంటిమెంట్‌ను కళ్యాణ్‌కృష్ణ అధిగమించడం ఖాయమనే పాజిటివ్‌ టాక్‌ వచ్చేసింది. ఇక ఏనాడు తమ చిత్రాల గురించి విడుదలకు ముందుగానే పెద్ద పెద్ద మాటలు చెప్పని నాగ్‌ సైతం ఈ చిత్రం తనకు 'నిన్నేపెళ్లాడతా, మన్మథుడు' ఎలాగో చైతూకి అలా అవుతాయని చెబుతున్నాడు. 

ఇక చైతూ మాట్లాడుతూ, నా కెరీర్‌లో నేను చేసిన చిత్రాలు, ఫ్యాన్స్‌ నుండి నాకు దక్కిన అభిమానం మరువలేనది. గత చిత్రాల నుంచి చాలా నేర్చుకున్నాను. అక్కినేని ఫ్యామిలీలో పుట్టడం నా అదృష్టం. కానీ దాని మీదనే ఆధారపడను. నా కష్టాన్ని నేను నమ్ముకున్నాను. నాకు కెరీర్‌ లేకుంటే నాకిష్టమైన రెస్టారెంట్‌ బిజినెస్‌ కానీ ఆటోమోబైల్‌ బిజినెస్‌ గానీ చేసుకుంటానని బోల్డ్‌గా చెప్పాడు. ఇక నాగచైతన్య-సమంతల పెళ్లివేడుక అక్టోబర్‌ 6న గోవాలో జరుగనుందని సమాచారం. 

No Change in Rarandoi Veduka Chuddam Release Date :

Rarandoi Veduka Chuddam will hit the screens worldwide on May 26.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs