బాలయ్య చిత్రాల టైటిల్స్ ఆయన చిత్రాలలోని డైలాగుల వలే బహు పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఇక పూరీ చిత్రాల టైటిల్స్ ఎలా? ఉంటాయో అందరికీ తెలుసు. 'ఇడియట్, పోకిరి' వంటి టైటిల్స్‌తో సూపర్‌హిట్స్ కొట్టిన పూరీ ఆ తర్వాత 'రోగ్, లోఫర్' అంటూ దెబ్బతిన్నాడు. ఇక 'ఇజం' ఎలాంటి ప్రభావం చూపలేదు. సాధారణంగా ఓ టైటిల్‌ను మైండ్‌లో ఫిక్స్ చేసుకుని, దానికి తగ్గట్లుగా డైలాగ్స్, సీన్స్ రాసుకోవడం పూరీకి అలవాటు. కానీ బాలయ్య చిత్రం విషయంలో మాత్రం టైటిల్ పరంగా పూరీ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. షూటింగ్ జోరుగా సాగుతున్నా టైటిల్ విషయంలో మౌనంగా ఉన్నాడు.
ఇక ఈ చిత్రం మాఫియా నేపధ్యంలో గ్యాంగ్‌స్టర్ కథగా సాగనుందని సమాచారం. దాంతో పూరీ ఈ చిత్రానికి ఎలాంటి టైటిల్ ఖాయం చేస్తాడా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. 'టపోరి'తో పాటు కొన్ని టైటిల్స్ వార్తల్లోకి వచ్చాయి. ఇక 'సార్వభౌముడు', 'ఉస్తాద్' టైటిల్స్ కూడా హల్‌చల్ చేస్తున్నాయి. కానీ సీనియర్‌స్టార్ కాబట్టి పూరీ సైతం నాగార్జునతో చేసిన చిత్రాలకు 'శివమణి, సూపర్' వంటి రెస్పెక్టబుల్ టైటిల్స్ పెట్టాడు. అలాగే ఈసారి బాలయ్యకు కాస్త రాజీపడి, తిట్ల పేరును కాకుండా 'ఉస్తాద్'నే ఫైనల్ చేస్తాడని అంటున్నారు. మరోపక్క బాలయ్య 102వ చిత్రంగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలోచేసే చిత్రానికి 'రెడ్డిగారు' అని ఫైనల్ చేశారని వార్తలైతే వస్తున్నాయి గానీ క్లారిటీమాత్రం రాలేదు.